Home న్యూస్ నైజాంలో ఆల్ టైం టాప్ 5 బిజినెస్ లు సాధించిన సినిమాలు ఇవే!!

నైజాంలో ఆల్ టైం టాప్ 5 బిజినెస్ లు సాధించిన సినిమాలు ఇవే!!

0

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగిపోగా పెద్ద సినిమాలకు సాలిడ్ బిజినెస్ లు జరుగుతూ ఉండటం విశేషం, అన్ని ఏరియాలు ఒకెత్తు అయితే రీసెంట్ టైంలో నైజాం ఏరియాలో పెద్ద స్టార్స్ మూవీస్ కి ఎక్స్ లెంట్ బిజినెస్ లు జరుగుతున్నాయి…టికెట్ హైక్స్ అలాగే భారీ రిలీజ్ లు సొంతం అవుతూ ఉండటంతో….

భారీ రేట్లు పెట్టి కొనడానికి బయర్స్ వెనకడుగు వేయడం లేదు కానీ రీసెంట్ గా నాన్ రిఫండబుల్ అమౌంట్ రూల్ వలన కొన్ని సినిమాలకు ఇబ్బందులు గట్టిగానే రావడంతో కొత్తగా పెద్ద సినిమాలకు అడ్వాన్స్ బేస్ మీదే ఎంత మొత్తం అడిగితే అంత మొత్తం ఇవ్వడానికి బయర్స్ సిద్ధం అవుతూ ఉన్నారు…

ఇక రెండేళ్ళ క్రితం RRR movie నైజాంలో 70 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా ఈ రికార్డ్ బిజినెస్ ను అడ్వాన్స్ బేస్ మీద సమం చేసి సంచలనం సృష్టించింది.

Top 10 Telugu Trailer Records In 24 Hrs

ఒకసారి నైజాం ఏరియాలో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను అందుకున్న టాప్ 5 మూవీస్ ని గమనిస్తే… 
Nizam Area Top Pre Release Business Movies
👉#RRRMovie – 70CR
👉#KALKI2898AD – 70CR******
👉#Salaar- 60CR

👉#AdiPurush – 50CR
👉#GunturKaaram – 42.00CR

👉#Baahubali2 – 40CR
👉#Saaho – 40CR
👉#Acharya – 38CR

మొత్తం మీద నైజాంలో 50 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకున్న సినిమాలు 4 ఉండగా అందులో ప్రభాస్ మూవీస్ 3 ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక ఈ ఇయర్ లో అలాగే అప్ కమింగ్ టైంలో వరుస పెట్టి టాప్ స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఈ లిస్టులో కొత్త సినిమాలు ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఆ సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

Top 10 most Liked Telugu Trailers in 24hrs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here