Home న్యూస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు…కానీ 200 కోట్ల బిజినెస్…ఇదెక్కడి మాస్ రా బాబు!

ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు…కానీ 200 కోట్ల బిజినెస్…ఇదెక్కడి మాస్ రా బాబు!

3577
0

కొందరు స్టార్ హీరోల క్రేజ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కొత్త సినిమాల గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సినిమా పై ఉన్న హైప్ భారీగా పెరిగి పోతుంది, సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని అంతా ఫిక్స్ అవుతారు, ఆ సినిమా కి ట్రేడ్ లో కూడా ఉన్న పళంగా క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగి పోతుంది, సినిమా సెట్స్ పైన ఉండగానే బిజినెస్ చక చకా…

జరిగిపోవడం చాలా సినిమాల విషయం లో జరిగింది. అలానే రీసెంట్ గా ఓ స్టార్ హీరో సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవ్వలేదు కానీ సినిమా కి సంభందించిన టోటల్ బిజినెస్ మొత్తం కూడా క్లోజ్ అయినట్లు సమాచారం. కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన…

తల అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు సినిమా ఫస్ట్ లుక్ వస్తుందా అని చాలా రోజులుగానే ఎదురు చూస్తుండగా సినిమా ఫస్ట్ లుక్ డిలే అవుతూ వస్తుంది కానీ సినిమా గురించి లేటెస్ట్ గా ట్రేడ్ లో…

ఓ అల్టిమేట్ న్యూస్ బయటికి వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం సినిమా టోటల్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కంప్లీట్ గా అమ్మేశారని కోలివుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టోటల్ బిజినెస్ లెక్క ఏకంగా 200 కోట్లకు పైగా జరిగిందని అంటున్నారు. సెట్స్ పైన ఉండగానే బిజినెస్ జరగడం ఎప్పటి నుండో చూస్తుందే కానీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండా…

సినిమా టోటల్ బిజినెస్ కంప్లీట్ అవ్వడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేస్తారని, సినిమా దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఈ సినిమా అజిత్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here