బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే ఔట్ రైట్ రిజెక్ట్ అయిన విషయం తెలిసిందే. వీకెండ్ కే ఆల్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ చేసుకునే రేంజ్ లో నిరాశ పరిచిన ఈ సినిమా నిర్మాతగా దిల్ రాజు మైండ్ బ్లాక్ దెబ్బ కొట్టడానికి సిద్ధం అవుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ స్టేటస్ చూసిన తర్వాత…
మేకర్స్ ఇక ఓవరాల్ గా వచ్చే నష్టాల నుండి కొద్ది వరకు తప్పించుకోవడానికి సినిమాను త్వరగా డిజిటల్ లో రిలీజ్ చేసి కొంచం ఎక్కువ రేటు సొంతం చేసుకోవచ్చుగా అనుకుని సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎర్లీ OTT రిలీజ్ కోసం ట్రై చేయగా….
ప్రైమ్ వాళ్ళు సినిమా పై ఎలాంటి ఆసక్తిని కానీ ఎక్స్ ట్రా డబ్బులు ఇవ్వడానికి కానీ అస్సలు ఒప్పుకోలేదట. ముందు అనుకున్న డీల్ ప్రకారం 4 వారాల తర్వాతే సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక నిర్మాత సైలెంట్ అయ్యాడు అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.