Home న్యూస్ 14 ఏళ్ల తర్వాత కూడా ఫలితం శూన్యం…ఈ హీరో కష్టం ఊహాతీతం!

14 ఏళ్ల తర్వాత కూడా ఫలితం శూన్యం…ఈ హీరో కష్టం ఊహాతీతం!

1228
0

     నటనలో ఎంత PHD చేసినా కూసింత లక్ లేకపోతె ఇండస్ట్రీ లో నెట్టుకు రావడం కష్టం, అవకాశాలు వచ్చినా అవి హిట్స్ గా మారాలి అంటే సినిమాలో మ్యాటర్ ఉండాలి, దానిని తోడూ కొంచం లక్ కూడా ఉండాలి. 2005 లో వచ్చిన అపరిచితుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తో తమిళ్ తెలుగు భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విక్రం పరిస్థితి ఇప్పుడు ఎవ్వరికీ కూడా అంతు పట్టడం లేదు.

అపరిచితుడు తర్వాత ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ గీత ని దాటలేదు. కానీ అక్కడక్కడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన విక్రం అవి విజయాలు అందుకొక పోవడం తో వచ్చిన అవకాశాన్ని వృదా చేయడం ఇష్టం లేక అన్ని సినిమాలు ఒప్పుకుంటూ వస్తున్నాడు. దాంతో జనాలు థియేటర్స్ వైపు వెళ్ళడం కూడా మానేశారు.

విక్రం లేటెస్ట్ మూవీ మిస్టర్ కే.కే తెలుగు లో రిలీజ్ అయిన విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. సినిమా చూసిన వాళ్ళు కూడా ఇదేమి సినిమా రా బాబు అంటూ తల పట్టుకు కూర్చున్నారు. ఇలాంటి నాసిరకం సినిమాలను విక్రం ఎందుకు చేస్తున్నాడో తెలియదు అంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.

విక్రం గత 14 ఏళ్లలో ప్రేక్షకులను ఎంతో కొంత మెప్పించిన సినిమాలు ఐ మరియు ఇంకొక్కడు సినిమాలు. అవి కూడా హిట్లు ఏవి కావు, ఎదో యావరేజ్ గా అనిపించుకున్నవి. కానీ ఎంతో టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న విక్రం ఇలా నాసిరకం సినిమాలు చేస్తూ వస్తుండటం…

ఒకింత భాదాకరం అనే చెప్పాలి. మిస్టర్ కే.కే తెలుగు తమిళ్ రిజల్ట్ డిసాస్టర్ కి ఏమాత్రం తగ్గని విధంగా ఉండటం తో ఇక మీదట చేసే సినిమా తో అయినా ప్రేక్షకుల మనసును గెలుచుకునే సినిమా తీయాలని కోరుకోవడం తప్ప ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here