Home గాసిప్స్ 6 ఏళ్ళుగా హిట్ లేదు…ఇప్పుడు నంబర్ 1 డైరెక్టర్ తో సినిమా!!

6 ఏళ్ళుగా హిట్ లేదు…ఇప్పుడు నంబర్ 1 డైరెక్టర్ తో సినిమా!!

1689
0

బాలీవుడ్ చాలా కాలం ఏక చక్రాది పత్యంగా ఏలిన హీరోల్లో బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒకరు. చాలా ఏళ్ళు ఎలాంటి పోటి లేకుండా ఇయర్ ఇయర్ కి తన సినిమాలే టాప్ ప్లేస్ లో ఉండేవి.. ఆ రేంజ్ లో డామినేట్ చేసిన షారుఖ్ ఖాన్ కి 2009 నుండి పెద్దగా కలిసి రావడం లేదు… ఎంచుకునే సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడం తో విఫలం అవ్వడం తో ఫాం కోల్పోయాడు.

మధ్యలో చెన్నై ఎక్స్ ప్రెస్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చినప్పటీ 2014 లో హ్యాప్పీ న్యూ ఇయర్ తో మెప్పించినా తర్వాత ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని సొంతం చేసుకోలేక పోయాడు షారుఖ్ ఖాన్. చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వడం జరిగింది.

రేయిస్ సినిమా కొద్దిగా మెప్పించినా ఆ సినిమా కి కూడా చాలా చోట్ల నష్టాలు దక్కాయి. దాంతో 6 ఏళ్లుగా విజయానికి దూరం అయ్యాడు షారుఖ్ ఖాన్. 2018 చివర్లో చేసిన జీరో సినిమా అట్టర్ ఫ్లాఫ్ అవ్వడం తో అప్పటి నుండి కొత్త సినిమా ను అసలు మొదలు పెట్టలేదు.

ఇలాంటి టైం లో ఎ సినిమా తో కంబ్యాక్ ఇస్తాడా అని ఎదురు చూస్తుండగా… బాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరనీ తో తన అప్ కమింగ్ మూవీ కన్ఫాం అయింది. అపజయం అంటే తెలియని డైరెక్టర్ అయిన హిరానీ రెండేళ్ళ క్రితం సంజూ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టగా అప్పటి నుండి కొత్త సినిమా కమిట్ కాలేదు.

కానీ షారుఖ్ తో సినిమా ఇప్పుడు కన్ఫాం అవ్వడం తో షారుఖ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. లాక్ డౌన్ లేకుండా ఉంటె ఈ పాటికే వీళ్ళ సినిమా మొదలు అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకున్నాక ఇయర్ ఎండ్ లో సినిమా మొదలు అవుతుందని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమా తో కింగ్ ఖాన్ ఎలాంటి కంబ్యాక్ కొడతాడో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here