Home గాసిప్స్ సీటిమార్ రిలీజ్ అక్కడ ఆగిపోయింది…కారణం ఇదే!!

సీటిమార్ రిలీజ్ అక్కడ ఆగిపోయింది…కారణం ఇదే!!

2421
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ మీద గోపీచంద్ ఆశలు భారీగా పెట్టుకున్నాడు… బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ నటించిన సినిమాలు గత 7 ఏళ్ళుగా ఒక్కటి కూడా హిట్ గీతని దాటలేక పోయింది. కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా అంచనాలను అందుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయాయి. దాంతో వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్స్ గోపీచంద్ సొంతం అవ్వగా మార్కెట్ ని…

కోల్పోతూ వచ్చినా గోపీచంద్ తో సినిమాలు తీయడానికి ఇప్పటికీ నిర్మాతలు ఉండటం తో కొత్త సినిమాలు వరుస పెట్టి ఒప్పుకుంటున్న గోపీచంద్ ఇప్పుడు తన ఆశలను సీటిమార్ మీదే పెట్టుకోగా సినిమా రిలీజ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్నంతలో గ్రాండ్ గానే జరగబోతుండగా తెలుగు సినిమాకి…

తెలుగు రాష్ట్రాలు కర్నాటక అమెరికా మెయిన్ మార్కెట్ లు కాగా ఇప్పుడు సీటిమార్ సినిమా అమెరికాలో రిలీజ్ అవ్వడం లేదని తెలుస్తుంది… సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి కండీషన్ పెట్టడం తో వాళ్ళు సినిమా రిలీజ్ చేయడం లేదని చెప్పారట. సీటిమార్ మేకర్స్ పెట్టిన కండీషన్ ఏంటంటే… సినిమా అక్కడ…

మొత్తం మీద 100 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలని చెప్పారట… కానీ మాస్ మూవీ అవ్వడం గోపీచంద్ ప్రజెంట్ మార్కెట్ డౌన్ అవ్వడం తో అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ప్రింట్స్ ఖర్చులు కూడా రావని చేయలేం అంటూ డిస్ట్రిబ్యూటర్లు చెప్పగా అప్పటికీ మేకర్స్ తగ్గక పోవడం తో ఇక చేసేది ఏమి లేక సినిమాను ఇక్కడ రిలీజ్ చేయమని…

డిస్ట్రిబ్యూటర్లు చెప్పేశారట. దాంతో ఇప్పుడు అమెరికాలో సినిమా షోలు ఏమి పడటం లేదు అని తెలుస్తుంది. ఇక్కడ రిలీజ్ కన్నా అక్కడ ముందు ప్రీమియర్ షోలతో టాక్ వచ్చేది కానీ ఇప్పుడు సినిమాకి అక్కడ ఫస్ట్ డే షోలు లేనట్టే అని తెలుస్తుంది. ఒకవేళ టాక్ పాజిటివ్ గా వస్తే మేకర్స్ కొంచం తగ్గి మీ ఇష్టం అని చెబితే అమెరికాలో సినిమా రెండో రోజు నుండి రిలీజ్ కావొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here