బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది….అన్ని చోట్లా బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసిన సినిమా…
రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి…సినిమా రెండో రోజు 8-9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా అనుకున్నట్లే ఆ మార్క్ ని దాటేసిన సినిమా రెండో రోజు…
ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లోనే రికార్డ్ అనిపించే రేంజ్ లో 9.61 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు…బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ లో అఖండ 6.83 కోట్ల షేర్ ని అందుకోగా….తర్వాత చేసిన వీర సింహా రెడ్డి మూవీ 5.25 కోట్ల షేర్ ని అందుకుంది..
తర్వాత చేసిన భగవంత్ కేసరి మూవీ 4.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు అన్ని సినిమాల కలెక్షన్స్ ని క్రాస్ చేసిన డాకు మహారాజ్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో రోజు 9.61 కోట్ల మాస్ జాతర చేసింది…ఇక సంక్రాంతి సెలవుల్లో మాస్ సెంటర్స్ లో సినిమా రాంపెజ్…
ఇలానే సాలిడ్ గా కొనసాగే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో కలెక్షన్స్ విషయంలో సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లో సాలిడ్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా ఈ వీక్ లో ఓవరాల్ గా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.