బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బ్రో మూవీ(BRO The avatar) వర్కింగ్ డేస్ లో కొంచం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుండి గమనిస్తే…ఒక్క పోస్టర్ లో కూడా ఏ రోజు సినిమా కలెక్షన్స్ ని ప్రకటిస్తూ ప్రమోషన్ పోస్టర్స్ లాంటివి కూడా రిలీజ్ చేయలేదు అని చెప్పొచ్చు…
100 కోట్ల గ్రాస్ ను దాటినా కూడా మేకర్స్ నుండి ఎలాంటి పోస్టర్స్ రిలీజ్ అవ్వలేదు…అలాగే పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్ అయిన వకీల్ సాబ్ విషయంలో కానీ భీమ్లా నాయక్ మూవీస్ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ మేకర్స్ కి పోస్టర్స్ లో కలెక్షన్స్ ని…
ప్రకటించడం లాంటి వాటి పై స్ట్రిక్ట్ గా నో చెప్పినట్లు వార్తలు రాగా ఇప్పుడు బ్రో మూవీ విషయంలో కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతూ ఉండటం విశేషం… అప్పుడప్పుడు స్టార్స్ మూవీస్ కి గాని, ఇతర మూవీస్ కి గాను పోస్టర్స్ లో కలెక్షన్స్ ఎక్కువగా చెప్పి చూపించడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం.
అదే టైంలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాలకు కలెక్షన్స్ పోస్టర్స్ వేయకుండా ఇలా ఒక రూల్ పెట్టుకుని ఫాలో అవుతూ ఉండటం విశేషం అని చెప్పొచ్చు. ప్రజెంట్ మిగిలిన స్టార్స్ అందరిలో కలెక్షన్స్ పోస్టర్స్ లేకుండా ఉండేలా చూసుకుంటున్న ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్ అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇది ఇలానే కొనసాగుతుందో లేదో చూడాలి.