బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మీడియం రేంజ్ హీరో ల సినిమాల్లో సంచలనం సృష్టించిన లైగర్ సినిమా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది. దాంతో వీకెండ్ తర్వాత మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచి టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల విషయంలో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది…
ఈ సినిమాను భారీ రేటుకి కొన్న బయ్యర్లు థియేటర్ ఓనర్లు భారీగా నష్టపోగా రెండో వారంతో ఎంతో కొంత రికవరీ అవుతుంది అన్న నమ్మకం కూడా పెట్టుకోకుండా ఈ సినిమాను థియేటర్స్ నుండి తీసేసి బింబిసార, సీతారామం సినిమాలను తిరిగి థియేటర్స్ లో ప్రదర్శితం చేస్తున్నారు.
దానికి తోడూ ఈ వీకెండ్ మరో 2 కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ముందు రెండో వారంలో 170 థియేటర్స్ అనుకున్నా కానీ ఇప్పుడు లైగర్ సినిమా కి కొన్ని మేజర్ సెంటర్స్ లో కొన్ని షోలు మినహా ఎక్కడా కూడా థియేటర్స్ మిగలలేదు అనే చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని ఫస్ట్ వీక్ కే ఈ రేంజ్ లో థియేటర్స్ ను కోల్పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచిన సినిమా రీసెంట్ టైం లో ఈ సినిమానే అని చెప్పాలి. కొత్త సినిమాల రిజల్ట్ ను బట్టి ఏమైనా థియేటర్స్ ని ఈ సినిమా తిరిగి సొంతం చేసుకుంటుందో ఏమో చూడాలి.