Home గాసిప్స్ 3 లో ఒకరు అనుకుంటే…కొత్త ఆప్షన్….రాక్షసుడు2 హీరో ఇతనేనా?

3 లో ఒకరు అనుకుంటే…కొత్త ఆప్షన్….రాక్షసుడు2 హీరో ఇతనేనా?

2182
0

రీసెంట్ గా ఒక్క అనౌన్స్ మెంట్ తోనే సాలిడ్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుని తర్వాత టెలివిజన్ లో కూడా అద్బుతమైన TRP రేటింగ్ లతో సైకో థ్రిల్లర్ జానర్ లోనే అద్బుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న రాక్షసుడు సినిమా సీక్వెల్ రాక్షసుడు 2 నిలుస్తుంది అని చెప్పాలి. తమిళ్ లో ఒరిజినల్ రూపొండినా తెలుగు లో సినిమా కి సీక్వెల్ ని…

రీసెంట్ గా డైరెక్టర్ రమేష్ వర్మ అనౌన్స్ చేశారు. సీక్వెల్ లో స్టార్ కాస్ట్ గురించి మెయిన్ లీడ్ హీరో గురించి త్వరలో అనౌన్స్ చేస్తామని తెలియజేయగా సినిమా పోస్టర్ సోషల్ మీడియా లో సాలిడ్ పాపులారిటీని సొంతం చేసుకోవడం విశేషం. మొదటి పార్ట్ కి వచ్చిన…

అద్బుతమైన రెస్పాన్స్ వలన జస్ట్ పోస్టర్ రిలీజ్ తోనే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సీక్వెల్ లో హీరోగా ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తిగా మారగా టాలీవుడ్ నుండి రవితేజ, నితిన్ లేదా సీనియర్ హీరోలలో నాగార్జున ఈ సీక్వెల్ లో నటించ డానికి అవకాశం ఉందని…

వార్తలు శిఖరు చేయడం మొదలు పెట్టినా ఇప్పుడు వీళ్ళు కాకుండా మరో హీరో పేరు కూడా వినిపిస్తుంది. ఈ పేరు వెనక రీజన్ కూడా ఉందని అంటున్నారు. ఈ సీక్వెల్ లో ఇప్పుడు కోలివుడ్ తో పాటు తెలుగు లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్య లీడ్ లో నటించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

నటుడిగా ఎలాంటి వంక పెట్టడానికి అవకాశం ఇవ్వని విజయ్ సేతుపతి తెలుగు వారికి సైరా మరియు ఉప్పెన సినిమాల ద్వారా బాగా పరిచయం ఉంది. విజయ్ ని తీసుకోవడం వలన సినిమా తమిళ్ లో కూడా డబ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డబుల్ మార్కెట్ కి అవకాశం ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది త్వరలో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here