టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం టేక్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న కొత్త సినిమా బ్రో ది అవతార్(Bro The Avatar) మీద ఫ్యాన్స్ లో డీసెంట్ అంచనాలు ఉండగా న్యూట్రల్ ఆడియన్స్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
సినిమా రిలీజ్ కి వారం మాత్రమే టైం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఇతర రీసెంట్ పవన్ కళ్యాణ్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమా వరకు అయితే మేకర్స్ ఒక స్టేట్ మెంట్ ని రిలీజ్ చేశారు…
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్(Vakeel Saab) కానీ భీమ్లా నాయక్(Bheemla Nayak) కానీ బెనిఫిట్ షోలు సాలిడ్ టికెట్ హైక్స్ తో రిలీజ్ అవ్వగా ఆంధ్రలో పొలిటికల్ ఇబ్బందులను ఫేస్ చేసిన విషయం తెలిసిందే.
కానీ బ్రో సినిమా విషయానికి వచ్చే సరికి నిర్మాత సినిమాను అండర్ బడ్జెట్ లోనే తెరకెక్కించామని, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి రిటర్న్స్ వచ్చాయని చెబుతూనే ఈ సినిమాకి నార్మల్ టికెట్ రేట్లు సరిపోతాయని, ఎక్స్ ట్రా గా హైక్స్ లాంటివి ఏమి అవసరం లేవని తెల్చాశారు…
పవన్ ప్రీవియస్ మూవీస్ విషయంలో ఆంధ్రలో బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ వలన గొడవలు జరగడంతో ఇప్పుడు అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు… ప్రస్తుతానికి సినిమా మీద పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు కాబట్టి బాక్స్ అఫీస్ దగ్గర నార్మల్ రేట్స్ తో రిలీజ్ కాబోతున్న బ్రో మూవీ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.