Home గాసిప్స్ ఎన్టీఆర్ 10…నాని 8…నాగార్జున 12…దిమ్మతిరిగే షాక్ ఇది!

ఎన్టీఆర్ 10…నాని 8…నాగార్జున 12…దిమ్మతిరిగే షాక్ ఇది!

929
1

 

    దేశం అంతా పాపులర్ అయిన బిగ్ బాస్ టాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం రాగా మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం తో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుంది, దాంతో రెండో సీజన్ పై అంచనాలు పెరిగిపోగా ఎన్టీఆర్ నో చెప్పడం తో నాచురల్ స్టార్ నాని తో హోస్ట్ చేయించగా ఎపిసోడ్స్ సరిగ్గా చూడకపోవడం తో అనేక విమర్శల పాలయ్యాడు నాని.. ఆ సీజన్ కూడా అనేక విమర్శలకు నిలువు అయ్యింది.

దాంతో మూడో సీజన్ హోస్ట్ గా ఎవరు ఉంటారు అన్నది ఆసక్తి గా మారగా అనేక విమర్శలను ఎదురుకోవడానికి కింగ్ నాగార్జున ముందుకు వచ్చారు. దాంతో నాగార్జున కి హోస్ట్ గా భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న న్యూస్.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం తొలి సీజన్ హోస్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ కి ఒక్కో ఎపిసోడ్ కి గాను 10 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం, ఇక రెండో సీజన్ కి గాను ఎన్టీఆర్ నో చెప్పడం తో నాని కి కూడా భారీ ఎత్తున ఎపిసోడ్ కి 8 లక్షల చొప్పున ఇచ్చారట.

ఇక మూడో సీజన్ ని ఎవరూ హోస్ట్ చేయడానికి ముందుకు రాకపోవడం తో కింగ్ నాగార్జున కి ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కి గాను 12 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. దాంతో ఎన్టీఆర్ పేరిట ఉన్న రికార్డ్ రెమ్యునరేషన్ ని ఇప్పుడు నాగార్జున క్రాస్ చేయబోతున్నట్లు చెప్పొచ్చు.

ఇది వరకు మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి కూడా నాగార్జున 7 లక్షల దాకా ఒక ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ తీసుకున్నారట. కానీ ఇప్పుడు రికార్డ్ లెవల్ లో రెమ్యూనరేషన్ అందుకోబోతున్న నాగార్జున రాబోవు విమర్శలను ఎదిరించి షో ను ఎంతవరకు విజయవంతం చేస్తారు అన్నది అందరి లోను ఆసక్తి రేపుతున్న ప్రశ్న గా చెప్పుకోవచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here