Home న్యూస్ 20 ఇయర్స్ ఫర్ ఎన్టీఆర్ : 24 గంటలు ఓవర్….షాకింగ్ టాప్ 4!

20 ఇయర్స్ ఫర్ ఎన్టీఆర్ : 24 గంటలు ఓవర్….షాకింగ్ టాప్ 4!

1341
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో అడుగు పెట్టి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే, కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఎన్టీఆర్ హై మూమెంట్స్ ని కూడా చాలానే చూశాడు, ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో అపజయం అంటే తెలియకుండా కెరీర్ ని 5 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా సెన్సేషన్….

ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, కాగా రీసెంట్ గా టాలీవుడ్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టి 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ట్రెండ్ ను ముందు నుండే ప్లాన్ చేశారు కానీ అనుకున్న రేంజ్ లో అమలు పరచలేదు.

ట్విట్టర్ లేటెస్ట్ అప్ డేట్ కూడా కొంచం ఎదురు దెబ్బ కొట్టడం ఫ్యాన్స్ అనుకున్న రేంజ్ లో ఆన్ లైన్ లోకి రాకపోవడం లాంటి కారణాలు ప్రభావం చూపి మొత్తం మీద 24 గంటల్లో టాప్ 4 ప్లేస్ తోనే సరిపెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒకసారి టాప్ యాక్టర్స్ యానివర్సరీ ట్రెండ్స్ ని గమనిస్తే…

👉#13YearsForRamCharanInTFI- 2.5M
👉#17VictoriousYrsOfAlluArjun- 1.7M
👉#46GloriousYearsOfNBK – 900.1K~
👉#2DecadesOfNTREra: 876K~***
👉#39YearsForTriumphSSMBinTFI- 590K
👉#19YrsOfSovereignNTR- 575K
24 గంటల్లో 20 ఇయర్స్ ఫర్ ఎన్టీఆర్ ట్రెండ్ కేవలం 8 లక్షల 76 వేల ట్వీట్స్ తోనే సరిపెట్టగా టాప్ ప్లేస్ లో రామ్ చరణ్ యానివర్సరీ ట్రెండ్ 2.5 మిలియన్స్ తో టాప్ లో అలానే కొనసాగుతుంది. ఇక రెండో ప్లేస్ లో అల్లుఅర్జున్ ట్రెండ్….

మరియు మూడో ప్లేస్ లో బాలయ్య ట్రెండ్ లు ఉండగా 4 వ ప్లేస్ లో ఇప్పుడు ఎన్టీఆర్ ట్రెండ్ నిలిచింది, కారణాలు ఏవైనా కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకున్న కానీ షాకింగ్ ట్రెండ్ తో ఫ్యాన్స్ టాప్ 4 ప్లేస్ తోనే సరిపెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కోసం 2 ఏళ్ళు కేటాయించగా వచ్చే ఏడాది సినిమా పాన్ ఇండియా లెవల్ క్రేజ్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here