Home న్యూస్ ఎన్టీఆర్ 3….మహేష్ 3…కాచుకోండి ఇక!!

ఎన్టీఆర్ 3….మహేష్ 3…కాచుకోండి ఇక!!

647
0

సోషల్ మీడియా లో హీరోలు పెద్దగా యాక్టివ్ గా ఉండరు, ఎప్పుడో కానీ ఎదో ఒక అప్ డేట్ ఇస్తూ ఉంటారు, ఇలా ఇచ్చారు కదా అని అన్ని ట్వీట్స్ కి ఫ్యాన్స్ వీర లెవల్ లో లైక్స్ అండ్ రీ ట్వీట్స్ చేయరు, అందరి కీ నచ్చేలా, ప్రస్తుత అంశాల పై గట్టి గా స్పందించినప్పుడు మాత్రమే మన హీరోల ట్వీట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి.

రీసెంట్ గా మన హీరోల ట్వీట్స్ కి కూడా ట్విట్టర్ లో లక్ష లైక్స్ వస్తున్నాయి. ఇది అందరి కన్నా ముందుగా ఎన్టీఆర్ కి దక్కగా తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రానా, అల్లు అర్జున్ లేటెస్ట్ గా రామ్ చరణ్ ల ట్వీట్ కి ఒకటి తర్వాత ఒకటి లక్ష లైక్స్ రావడం మొదలైంది.

అందరి లోకి ప్రస్తుతానికి నిన్నటి వరకు ఎన్టీఆర్ కి 3 సార్లు 1 లక్ష లైక్స్ వచ్చిన ట్వీట్స్ ఉండగా తర్వాత రెండేసి లక్ష లైక్స్ తో మహేష్, పవన్, రానా ఉన్నారు… అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లకు ఒక్కో సారి ఈ రికార్డ్ దక్కింది, కానీ లేటెస్ట్ గా మహేష్ బాబు కి మరో లక్ష లైక్స్ దక్కాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇక లేరు అన్న విషయం తెలిసి ట్వీట్స్ అందరూ వేయగా వాళ్ళలో ముందుగా మహేష్ ట్వీట్ కి 1 లక్ష లైక్స్ దక్కగా మహేష్ ఖాతాలో ఇప్పుడు మూడు సార్లు లక్ష లైక్స్ ఉన్న ట్వీట్స్ పడ్డాయి. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ మరియు మహేష్ లు ఇద్దరూ కూడా

చెరో మూడు సార్లు లక్ష లైక్స్ ని అందుకుని రచ్చ చేస్తున్నారు…. కాగా త్వరలో ఇద్దరికీ మరిన్ని లక్ష లైక్స్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. రీసెంట్ ట్వీట్స్ లో కొన్ని లక్ష లైక్స్ కి సిద్ధంగా ఉండటం తో కొన్ని రోజుల్లో వీరి టోటల్ కౌంట్ మారే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here