ఇదొక్కటి చాలు…చరిత్ర సృష్టించడానికి

0
1573

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సామెత వీర రాఘవ పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది.

ఇక ఇప్పుడు సినిమా లో మెయిన్ హైలెట్స్ గా ఇంటర్వెల్ సీన్ మరియు సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఎన్‌టి‌ఆర్ సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు క్లాస్ మూవీస్ తీసిన త్రివిక్రమ్ ఈ సారి పూర్తి మాస్ కథని తెరకెక్కిస్తున్నాడట.

ఈ రెండు ఫైట్ సీన్స్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళతాయని, మళ్ళీ సింహాద్రి రోజులను గుర్తు చేస్తాయని అంటున్నారు. ఇది నిజం అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టించడానికి ఈ ఫైట్ సీన్స్ ముఖ్య కారణం అయినా ఆశ్యర్యపోనవసరం లేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here