ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమా!

0
664

 

ఎన్టీఆర్ హీరోగా ఇప్పటికే RRR చేస్తున్నాడు కదా మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమా ఏంటి అని అనుకోకండి, ఇది మరో ఎన్టీఆర్ సినిమా…నందమూరి హీరోల్లో ఒకరైన నందమూరి తారక రత్న కూడా స్క్రీన్ నేమ్ ని అప్పట్లో ఎన్టీఆర్ గా పెట్టుకున్నాడు. ఒకటో నంబర్ కుర్రాడు అంటూ తొలి సినిమా సమయం లోనే ఏకంగా 8 కొత్త సినిమాలను ఒప్పుకున్న ఈ ఎన్టీఆర్ ఆ 8 సినిమాలు ప్రేక్షకుల మనసు గెలుచుకోక పోవడంతో హీరో నుండి…

విలన్ గా మారి అనసూయ సినిమా చేశాడు, ఆ సినిమా హిట్ అవ్వగా మళ్ళీ అలాంటి రోల్స్ చేస్తాడు అనుకున్నా హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసి సెట్ అవ్వక కొంత గ్యాప్ తీసుకుని క్యారక్టర్ రోల్స్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని హీరోగా మరో ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం.

తారకరత్న కొత్త సినిమా పేరు ‘దేవినేని’ అంట. ఇది విజయవాడ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన దేవినేని నెహ్రూ బయోపిక్ కాని బయోపిక్ గా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి డైరెక్షన్ నారా నాగేశ్వరరావు అనే కొత్త దర్శకుడు చేస్తున్నాడట.. రాము రాథోడ్ అనే నిర్మాత కలిసి ఈ సినిమా తీస్తున్నారు… మరి ఈ సినిమా తో అయినా కంబ్యాక్ చేస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!