Home న్యూస్ ట్రైలర్ రెస్పాన్స్ పీక్స్…ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోతే!

ట్రైలర్ రెస్పాన్స్ పీక్స్…ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోతే!

192
0

  నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీ తర్వాత వస్తున్న మూవీ ఎన్టీఆర్ బయోపిక్. 2 పార్టులుగా వస్తున్న ఈ సినిమా లోని మొదటి పార్ట్ సంక్రాంతి కి భారీ గా రిలీజ్ కానుండగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ ని భారీ ఎత్తున రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ మాత్రం అల్టిమేట్ లెవల్ లో ఉందని చెప్పాలి. సినిమా పై…

ముందు నుండి అంచనాలు ఉన్నప్పటికీ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయమని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు భావిస్తుండటం విశేషం.

బిజినెస్ ఇప్పటి నుండే మరింత జోరు అందుకోగా సినిమా రిలీజ్ సమయానికి క్లియర్ గా మొదటి పార్ట్ బిజినెస్ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులు అందుకోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించే రికార్డులు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here