Home TRP రేటింగ్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు…ఫస్ట్ వీక్ ప్రతీ రోజు ఎంత TRP రేటింగ్ వచ్చిందంటే!!

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు…ఫస్ట్ వీక్ ప్రతీ రోజు ఎంత TRP రేటింగ్ వచ్చిందంటే!!

3211
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై ఆల్ మోస్ట్ 4 ఏళ్ల తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు… రేటింగ్ లు లేక పాతాళానికి వెళ్ళిపోయిన షో ని హోస్ట్ చేయడానికి ఒప్పుకున్న ఎన్టీఆర్ మొదటి వారం వరకు మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని దుమ్ము లేపాడు అని చెప్పాలి. జెమినీ టీవీ అంటే ఎక్కువగా వీకెండ్ టైం లో సినిమాలకు మాత్రమె ఎక్కువగా TRP రేటింగ్ లు వస్తూ ఉంటాయి కానీ వర్కింగ్ డేస్ లో ఎక్కువగా…

సీరియస్ అన్నీ కూడా స్టార్ మా లేదా జీ తెలుగు లాంటి ఛానెల్స్ లో ఎక్కువగా రావడం తో జెమినీ టీవీ ని పెద్దగా వీక్ డేస్ లో పట్టించుకోరు… అదే టైం లో అప్పుడప్పుడు కొన్ని షోలకి డీసెంట్ రేటింగ్స్ వచ్చినా కన్సిస్టంట్ గా అయితే రేటింగ్ లను మెయిన్ టైన్ చేయలేక పోయింది.

అలాంటి టైం లో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ని ఒప్పుకోగా మొదటి ఎపిసోడ్ కి ఆర్ ఆర్ ఆర్ తనతో కలిసి నటిస్తున్న రామ్ చరణ్ తో కలిసి కర్తైన్ రైసర్ ఎపిసోడ్ ను చేయగా ఫస్ట్ ఎపిసోడ్ కి 11.4 రేటింగ్ సొంతం అయ్యింది.

కానీ మొత్తం మీద ఆ వీక్ లో 4 ఎపిసోడ్ లు ఎన్టీఆర్ చేయగా అందులో 2 రామ్ చరణ్ తో మరో 2 నార్మల్ కంటేస్టంట్స్ తో జరిగింది. రామ్ చరణ్ ఉన్న రెండో ఎపిసోడ్ కి గాను 5.41 రేటింగ్ దక్కగా మూడో రోజు 5.22 TRP రేటింగ్ సొంతం అయ్యిందని. ఇక 26 వ తేదీ 4 వ ఎపిసోడ్ ఉండగా ఆ ఎపిసోడ్ కి…

6.21 TRP రేటింగ్ సొంతం అయ్యి ఓవరాల్ గా వీక్ మొత్తం మీద యావరేజ్ గా 6.76 రేటింగ్ ను సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లో యావరేజ్ గా 5.62 రేటింగ్ ను సొంతం చేసుకుంది… దాంతో మొత్తం మీద మొదటి వారం లో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు కి మంచి రేటింగ్ లు సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక రెండో వారంలో ఎలాంటి రేటింగ్ లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here