ఎవరైనా అంతే….తమ ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా లో తప్పు ఒప్పులు ఒప్పుకోరు, సినిమా బాలేదు అంటే సహించరు….డిఫెండ్ చేస్తారు…సోషల్ మీడియాలో వార్ చేస్తారు…సినిమా ఫేట్ మారితే ఓకే…లేదంటే సినిమా రిజల్ట్ చూసి అప్పుడు రిజలైజ్ అవుతారు…కానీ లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయినా రీసెంట్ టైంలో టాప్ స్టార్ మూవీస్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన దేవర(Devara Part 1) ఎపిక్ రన్ ని కంప్లీట్ చేసుకుని..
రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది….దాంతో డిజిటల్ లో సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పార్టు పార్టులుగా సాంగ్స్ అండ్ ఫైట్స్, అనిరుద్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ వరకు సాలిడ్ రెస్పాన్స్ ఉన్నా కూడా సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి…ఇవి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్వయంగా…
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ మాత్రం కేర్ తీసుకోకుండా సినిమా ఎలా తీశారు అని అంటున్నారు…సినిమాలో క్లైమాక్స్ ఎండింగ్ ఏమాత్రం షాక్ ఇచ్చేలా కన్విన్స్ చేయలేక పోయారు…అసలు కొడుకు తండ్రిని ఎందుకు పొడిచాడో అన్న బిగ్ షాక్ ఎలిమెంట్ లేకుండా…
సీన్ ని సడెన్ గా ఎండ్ చేశారు…ఆ సీన్ ను బట్టి ఇంటర్వెల్ టైంకి దేవర చనిపోతాడు…కానీ ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళే వాళ్ళని చిన్న పిల్లోడు అయిన దేవర కొడుకు ఎలా ఆపగాలిడాడో అన్న డౌట్ ఉంది….సినిమాలో యంగ్ ఎన్టీఆర్ చాలా అమాయకుడు అంటూ చూపించారు…
కానీ ఫస్ట్ నుండి పోస్టర్స్ లో యంగ్ రోల్ కి కూడా ఎలివేట్ చేస్తూ చేతిలో కత్తితో, షార్క్ తో సీన్ ను చూపెడుతూనే ఉంటే తన రోల్ అమాయకపు రోల్ అన్న పూర్తి ఎక్సైట్ మెంట్ రాలేదు…ఇక హీరోయిన్ రోల్ ఎంత క్రింజ్ గా అనిపించిందో అందరికీ తెలిసిందే…
ఇలా సినిమాలో ఉన్న ఫ్లాస్ ను టీం కి చేరేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండగా పార్ట్ 2 లో ఇవన్నీ కచ్చితంగా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు….సినిమా రిలీజ్ టైంలో సైలెంట్ గా ఉండి రన్ అయ్యాక ఇప్పుడు డిజిటల్ కి వచ్చాక ఫ్యాన్స్ ఇలా…
తమ హీరో సినిమా లో ఉన్న ఫ్లాస్ ను వెతికి టీం కి చెబుతూ ఉండటం విశేషం…మరి టీం ఈ విషయాలను గుర్తించి పార్ట్ 2 విషయంలో ఏ మేరకు ఫ్యాన్స్ ఫుల్ అంచనాలను అందుకోగలుగుతారో చూడాలి…ఇక డిజిటల్ రెస్పాన్స్ ఎలా ఉన్నా సాలిడ్ వ్యూవర్ షిప్ తో దేవర రచ్చ చేస్తూ దూసుకు పోతుంది.