Home గాసిప్స్ విజయ్ కోసం ఎన్టీఆర్…. ఇక తెలుగు లో రచ్చ రచ్చ ఖాయం!

విజయ్ కోసం ఎన్టీఆర్…. ఇక తెలుగు లో రచ్చ రచ్చ ఖాయం!

1379
0

కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ తో పాటు ఇండియా లో అన్ని ఇండస్ట్రీ ల వాళ్ళు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ చేసుకోండి అని పర్మీషన్ ఇచ్చినా కానీ హీరోలు రిస్క్ చేయాలి అని అనుకోవడం లేదు, దాంతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అనేక సినిమా లు రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ పాటికే అనేక సినిమాలు..

రిలీజ్ అయ్యేవి, అందులో కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన మాస్టర్ కూడా ఒకటి. కాగా ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉండగా ఏప్రిల్ 9 న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి ఎప్పుడు వస్తుంది అన్న క్లారిటీ కూడా లేదు…

ఇక ఈ సినిమా తమిళ్ సాంగ్స్ రిలీజ్ అవ్వగా తెలుగు డబ్బింగ్ ఉన్నప్పటికీ తెలుగు లో ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. కాగా ఈ సినిమా లో ముందుగా రిలీజ్ అయిన విజయ్ పాడిన కుట్టి స్టొరీ పాట బాగా హిట్ అయ్యింది.

కాగా ఈ పాట ని తెలుగు లో ఎన్టీఆర్ చేత పాడించాలని భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు రాగా కరోనా ఎఫెక్ట్ తో సైలెంట్ అయ్యారు. కాగా ఇప్పుడు తిరిగి ఈ వార్తలు శిఖారు చేయడం మొదలు పెట్టాయి. ఎన్టీఆర్ ఈ పాట తెలుగు వర్షన్ పాడబోతున్నారు అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉండగా ఎన్టీఆర్ మ్యానేజర్ కోనేరు ఈ సినిమా తెలుగు రైట్స్ కొన్న నేపధ్యంలో తన సైడ్ నుండి అలాగే విజయ్ సైడ్ నుండి ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు అంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ నో చెబితే విజయ్ తెలుగు లో తన ఓన్ వాయిస్ తో ట్రై చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి ఏది నిజం అవుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here