ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సినిమాల్లో టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2(War2 Movie) సినిమా మీద క్రేజ్ మరో లెవల్ లో ఉంది…
కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా ఓవరాల్ గా రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు టీసర్ బాగుంది అనిపించినా కూడా ఓవరాల్ గా మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుండి మాత్రం…
వార్ 1 లానే వార్ 2 టీసర్ ఉందని, అలాగే హృతిక్ ని ఎక్కువ హైలెట్ చేశారు అంటూ చెప్పుకొస్తున్నారు….కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు మాత్రం టీసర్ లో ఎన్టీఆర్ కూడా కుమ్మేశాడని చెప్పాలి. ఇక ఓవరాల్ గా టీసర్ లో మిగిలిన షాట్స్ అన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా…
ఇతర ఆడియన్స్ ను అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో హై ఇచ్చిన షాట్ మాత్రం ఎన్టీఆర్ హాస్పటల్ లో బాడీ పై బ్యాండేజ్ వేసుకుని సూటు బూటు వేసుకుని వచ్చే షాట్ అందరికీ ఓ రేంజ్ లో నచ్చేసింది అని చెప్పాలి. ఆ షాట్ టైం ఉన్నది 2 క్షణాలే అయినా కూడా…
రీసెంట్ టైంలో ఎన్టీఆర్ ని ఈ రేంజ్ స్టైలిష్ టచ్ తో మాస్ గా చూపించింది మాత్రం ఈ సినిమా లోనే అనిపించేలా ఆ షాట్ కి అందరి నుండి యునానిమస్ రెస్పాన్స్ ఉంది. సినిమాలో కూడా ఎన్టీఆర్ కి కొన్ని సాలిడ్ సీన్స్ పడ్డాయని చెబుతూ ఉండటంతో ఈ సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో బాలీవుడ్ లో మార్కెట్ ని పెంచుకుంటాడో చూడాలి ఇప్పుడు.