నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు 10.15 కోట్ల షేర్ ని అందుకోగా కలెక్షన్స్ అనుకున్న లెవల్ లో లేకపోవడం కొంత షాక్ కి గురి చేసింది, ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పోటి దారు సూపర్ స్టార్ రజినీ కాంత్ పేట నుండి ఎదురు అవ్వడంతో కొన్ని సెంటర్స్ లో పోటి లో నిలిచినా కానీ…
ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 50 టు 60% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, దానికి తోడూ థియేటర్స్ కూడా పేట సినిమాకి చాలా వరకు వెళ్ళిపోవడం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపింది.
ఉన్న థియేటర్స్ లో సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఓవరాల్ 20% ఆక్యుపెన్సీ ని టోటల్ గా సాధించినా బిజినెస్ ని అందుకోవడానికి ఇది సరిపోదు అనే చెప్పాలి, ఈవినింగ్ అండ్ నైట్ షోల లో సినిమా భారీ గా పుంజుకుంటే రెండో రోజు 4 కోట్లకి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది, మరి సినిమా నైట్ వరకు ఎంత వరకు గ్రోత్ ని సాధిస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.