ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ…రేటింగ్!

        బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ మొదలు అయింది, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన మొదటి పెద్ద సంక్రాంతి మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా రిలీజ్ అవ్వగా స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అవ్వడం తో అందరి లోను మంచి అంచనాలే సినిమా పై ఏర్పడ్డాయి. మరి సినిమా అందరి అంచనాలను అందుకునే విధంగా ఉందో లేదో తెలుసుకుందాం పదండీ..

స్టొరీ లైన్: ఒక సామాన్య ఉద్యోగి ఎలా తన కళని నిజం చేసుకోవడానికి సినీ పరిశ్రమ లో అడుగు పెట్టాడు, ఎలా లెజెండ్రీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అన్నది ఓవరాల్ గా కథ. బయోపిక్ అవ్వడం తో టోటల్ స్టొరీ ని రివీల్ చేయడం లేదు.

NTR Kathanayakudu Predictions

పెర్ఫార్మెన్స్: ఒక్క సినిమా లో అనేక గెటప్స్ తో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు, ఈ సినిమా లో బాలయ్య ఏకంగా 60 వరకు గెటప్స్ తో చాలా వరకు మెప్పించాడు, సీనియర్ ఎన్టీఆర్ లా 60 ఏళ్ల వయసు సీన్స్ నుండి అచ్చు గుద్ది నట్లు ఎన్టీఆర్ ని దింపేశాడు బాలయ్య.

NTR Part 1 Predictions

కానీ అదే సమయం లో యంగ్ ఎన్టీఆర్ లా మాత్రం బాలయ్య అంత పెర్ఫెక్ట్ గా అయితే సూట్ కాలేదు. కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ ని మరిపించే విధంగా నటించి మెప్పించాడు నట సింహం, కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఇదొకటి గా చెప్పుకోవచ్చు.

NTR- Kathanayakudu Total Pre Release Business Details

ఇక బసవతారకంగా విద్యాబాలన్ నటన కూడా ఆకట్టుకుంటుంది, బాలయ్య తర్వాత సినిమాలో బలమైన ముద్ర వేసే రోల్ లో విద్యాబాలన్ పెర్ఫెక్ట్ గా నటించి మెప్పించింది, మిగిలిన నటీనటులు చాలా మంది ఉండటం తో అందరినీ వెండితెరపై చూడటం కనుల పండగ అనే చెప్పాలి.

సంగీతం: కీరవాణి అందించిన పాటలు అన్నీ సినిమా కి తగ్గట్లు ఉండగా పాటలతో మరోసారి మెప్పించాడు కీరవాణి, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరోసారి తన మార్క్ ని చూపెట్టి ఆకట్టుకుని సినిమా కి మెయిన్ పిల్లర్ లో ఒకడిగా నిలిచాడు.

విశ్లేషణ: సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, అవి బాలయ్య పలికిన విదానం మరింతగా ఆకట్టుకుంటుంది, ఎడిటింగ్ పర్వాలేదు కానీ మరింత షార్ప్ గా ఉంటె బాగుండేది అనిపిస్తుంది, లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ అక్కడక్కడ కలిగింది.

క్రిష్ అతి తక్కువ సమయంలో ఇలాంటి క్వాలిటీ క్వాంటిటీ ఉన్న ప్రాడక్ట్ ని అందించడం విశేషం అనే చెప్పాలి, ఎన్టీఆర్ గారి సినీ చరిత్రలో ముఖ్య గట్టాలు అన్నీ అద్బుతంగా చూపెట్టి మెప్పించాడు క్రిష్. మాయాబజార్ సీన్ లో శ్రీకృష్ణుడిగా బాలయ్య ని చూపెట్టిన తీరు అద్బుతం అనే చెప్పాలి.

ఇన్ని ప్లస్ లు ఉన్నా కానీ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర గురించి అందరికీ తెలియడంతో సినిమాలో తర్వాత సీన్ ఏం వస్తుందో ఈజీగా చెప్పేయడం జరుగుతుంది, అలాగే నరేషన్ స్లో గా సాగుతుండటం యూత్ ఆడియన్స్ కి అంత ఓపిక పట్టి చూసేలా అనిపించలేదు.

అలాగే సెకెండ్ ఆఫ్ అక్కడక్కడ నరేషన్ మరీ స్లో అవ్వడం ఇబ్బంది పెట్టింది, బాలయ్య ని యంగ్ ఎన్టీఆర్ గా మరింత బాగా చూపెడితే బాగుండు అనిపిస్తుంది, ఇవి సినిమా కి మేజర్ మైనస్ పాయింట్స్. ప్లస్ లతో పోల్చితే ఇవి ఏమాత్రం మైనస్ కావనే చెప్పాలి.

ముందు చెప్పినట్లు చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ని పక్కకు పెడితే సినిమా ఈజీగా చూసి ఓ అద్బుతమైన సినిమా చూసిన ఫీలింగ్ తో బయిటికి వచ్చే విధంగా సినిమా ఉంటుంది, యూత్ ఎంతవరకు సినిమా ని ఓన్ చేసుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి కరం.

టోటల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్… మహా అద్బుతం అనిపించక పోయినా తెలిసిన కథని చాలా వరకు అంచనాలను మించే విధంగా మెప్పించాడు దర్శకుడు. కొంచం ఓపిక తో ఇదో బయోపిక్ అని గుర్తు పెట్టుకుని సినిమా చూస్తె మంచి సినిమా చూశామన్నా ఫీలింగ్ తో బయటికి రావచ్చు.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE