Home న్యూస్ ఎన్టీఆర్ మహానాయకుడు డే 2(60 లక్షలు) అనుకుంటే వచ్చింది ఇది!

ఎన్టీఆర్ మహానాయకుడు డే 2(60 లక్షలు) అనుకుంటే వచ్చింది ఇది!

456
0

     చరిత్రకెక్కే షాకింగ్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఊహలకు కూడా అందని విధంగా రెండో రోజే డమాల్ అంటూ కిందకు పడి పోయింది, ఈ మధ్య కాలం ఒక సినిమా కి మంచి టాకే కరువు అవ్వగా రెండు సార్లు మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ఎన్టీఆర్ సిరీస్ ఊహకందని లెవల్ లో కొలాప్స్ అయిపొయింది, బయోపిక్స్ ఫిలిమ్స్ లో ఈ రేంజ్ లో షాక్ ఇచ్చిన బయోపిక్ మరో టి లేదనే చెప్పాలి.

మొదటి రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 2.12 కోట్ల రేంజ్ షేర్ ని మాత్రమె వసూల్ చేసిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రెండో రోజు మొదటి రోజు తో పోల్చితే 70% వరకు ఓవరాల్ గా డ్రాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా సినిమా రెండో రోజు మొత్తం మీద కొంచం పుంజుకున్నా మినిమమ్ లో మినిమమ్ 60 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో అయినా షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంటుంది అని భావించినా కానీ ఊహించని షాక్ ఇచ్చిన సినిమా కేవలం 45 లక్షల షేర్ తోనే సరిపెట్టింది.

దాంతో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 2.04 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 60 లక్షల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది, దాంతో 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.72 కోట్ల షేర్ ని మాత్ర్రమే అందుకుంది.

ఒక స్టార్ హీరో నటించిన సినిమా 2.75 స్టార్స్ టు 3 స్టార్ రేటింగ్ తో ఓపెన్ అయిన సినిమా ఈ రేంజ్ లో లోవెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం అంటే అది ఎలాంటి షా కో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా మూడో రోజు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here