Home న్యూస్ షాకింగ్ న్యూస్..బాలయ్య కెరీర్ లోనే లోవెస్ట్ ఇది!

షాకింగ్ న్యూస్..బాలయ్య కెరీర్ లోనే లోవెస్ట్ ఇది!

781
0

     బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ మూవీస్ కి బయోపిక్స్ మంచి డిమాండ్ ఉన్న టైం ఇది, టాక్ పాజిటివ్ గా ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ రీసెంట్ టైం లో రిలీజ్ కి ముందు మంచి క్రేజ్ ని సొంతం చేసుకుని సోలో గా మొదటి రోజు ఎలాంటి పోటి లేకుండా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ టాక్ తెచ్చుకున్నా షాకింగ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు….

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించే రీసెంట్ మూవీస్ లో ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ సినిమాలే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు రావడం తో టాక్ ఎలా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సాలిడ్ గా ఓపెన్ అయ్యేవి.

కానీ ఎన్టీఆర్ కథానాయకుడు ఇచ్చిన షాక్ ఇంపాక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు పై గట్టిగానే పడగా సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు జరిగింది పరిశీలిస్తే 12% లోపే ఆన్ లైన్ బుకింగ్స్ ఉండటం అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది అని చెప్పాలి.

దాంతో ఈ ఇంపాక్ట్ మొదటి రోజు కలెక్షన్స్ పై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తుంది. రీసెంట్ టైం బాలయ్య మూవీస్ అన్నీ మొదటి రోజు మినిమమ్ లో మినిమమ్ 5 కోట్ల రేంజ్ కి పైగానే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి చూస్తుంటే…

మొదటి రోజు ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి 3 కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ టాక్ అద్బుతంగా ఉండి, కామన్ ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్స్ కి క్యూ కడితే తప్పితే ఇదే రేంజ్ ఓపెనింగ్స్ కన్ఫాం అని చెప్పాలి. దాంతో రీసెంట్ టైం లో ఇది బాలయ్య కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here