ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా

0
837

         సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిజల్ట్ తేడా కొట్టిన తర్వాత ఇప్పుడు రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అనుమానాలతో నేడు ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చేసింది. ముందుగా రెండు రాష్ట్రాలలో లిమిటెడ్ థియేటర్స్ లో ప్రీమియర్ షోలు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా అఫీషియల్ టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.

స్టొరీ పాయింట్ రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ లో ఎవరెవరు చేరారు, వారు ఎలాంటి వారు, పార్టీ ని ఎన్టీఆర్ ఎలా ముందుకు తీసుకెళ్ళారు, ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి సంక్షేమ పతకాలను ప్రవేశ పెట్టారు, తర్వాత పార్టీ లో అంతర్గత…

యుద్ధం ఎలా మొదలైంది, తిరిగి ఎన్టీఆర్ ఎలా పార్టీ ని తన చేతుల్లోకి తెచ్చుకున్నారు, ఇలా అనేక పాయింట్స్ ని టచ్ చేస్తూ క్రిష్ కొన్ని మార్పులు చేర్పులు చేసి సెకెండ్ పార్ట్ ని ఆసక్తి కరంగా తెరకెక్కించాడని అంటున్నారు, బయట ఎన్టీఆర్ పై చంద్రబాబు నాయుడు పై ఎలాంటి…

టాక్ ఉందో అది చెప్పకుండా ఇక్కడ మరో పాయింట్ ని చెప్పి ఏది నిజమో తెలియకుండా కొంచం కఫ్యూజ్ చేశారని అంటున్నా… ఓవరాల్ గా సినిమా పరంగా ఆసక్తి కరమైన అంశాలతో సినిమా ఆకట్టుకుందని అంటున్నారు. మొదటి పార్ట్ యంగ్ ఎన్టీఆర్ లా బాలయ్య సూట్ కాలేదు అన్న విషయం తెలిసిందే.

కానీ 60 ఇయర్స్ ఎన్టీఆర్ లా మాత్రం బాలయ్య ఆకట్టుకున్నాడు, ఇక్కడ టోటల్ గెటప్ అదే అవ్వడం తో ఎన్టీఆర్ ని అచ్చు గుద్దినట్లు దింపేసి మెప్పించాడట బాలయ్య. ఇతర పాత్రల్లో రానా క్యారక్టర్ కి కొన్ని హీరోయిజం సీన్స్ పడ్డాయని సమాచారం. మిగిలిన పాత్రలు పర్వాలేదు అనిపిస్తాయట.

సంగీతం పరంగా కీరవాణి మరోసారి ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో మరింత జోరు చూపెట్టాడని అంటున్నారు. క్రిష్ మొదటి పార్ట్ విషయం లో భారీ లెంత్ అండ్ స్లో నరేషన్ తో బోర్ కొట్టించిన్నప్పటికీ ఈ సారి మారి లెంత్ పరంగా పెర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకున్నాడని,

స్క్రీన్ ప్లే కూడా రేసీగా సాగుతుందని అంటున్నారు. అక్కడక్కడా కొంచం బోర్ కొట్టినా అది సినిమా కి ఎఫెక్ట్ చూపే లెవల్ లో అయితే లేదని అంటున్నారు. ఫైనల్ గా ఫస్టాఫ్ చక చకా సాగి ఆసక్తి కలిగించే విధంగా ఇంటర్వెల్ దాకా బాగుంది అనిపిస్తుందని,

సెకెండ్ ఆఫ్ పార్టీ పై పట్టు కోల్పోయిన తర్వాత ఫ్యామిలీ సీన్స్ కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తాయని దాంతో సెకెండ్ ఆఫ్ పర్వాలేదు అనిపిస్తుందని అంటున్నారు. మొత్తం మీద సినిమా మొదటి పార్ట్ లెవల్ లో బాగానే ఉన్నా లెంత్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా మెప్పిస్తుందని.

అదే సినిమాకి ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా చాలా వరకు మెప్పించిందని అంటున్నారు, ఫైనల్ టాక్ ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో ఉందని చెబుతున్నారు. మొదటి పార్ట్ విషయం లో కూడా ఇదే జరిగిన విషయం తెలిసిందే. ఇక కామన్ ఆడియన్స్…

అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా ఎంత దూరం వెళుతుందో చెప్పగలం. ఓవరాల్ గా ప్రీమియర్ షోలతో సినిమాకి మంచి టాకే వచ్చింది, ఇక ఇదే రేంజ్ టాక్ రోజు మొత్తం కొనసాగితే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే అవకాశం ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!