Home గాసిప్స్ ఎన్టీఆర్ మహానాయకుడు మొత్తం మార్చారు…గుమ్మడికాయ కొట్టారు

ఎన్టీఆర్ మహానాయకుడు మొత్తం మార్చారు…గుమ్మడికాయ కొట్టారు

540
0

సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని మూట గట్టుకున్న నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి ల ఎన్టీఆర్ కథానాయకుడు టోటల్ గా ఏకంగా 50 కోట్లకు పైగా నష్టాలను మిగిలించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు రెండో పార్ట్ పై భారీ ప్రెజర్ పెరగడం తో రిలీజ్ డేట్ ని ముందుగా ఫిబ్రవరి మొదటి వారం లో అనుకున్నా కానీ…

పోస్ట్ పోన్ చేసి చాలా వరకు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి షూటింగ్ ను మొదలు పెట్టగా సుమారు 25 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరిగిన షూటింగ్ ఎట్టకేలకు రీసెంట్ గా సారధి స్టూడియో లో కంప్లీట్ అయిందని సమచారం. షూటింగ్ అయిపోయిన వెంటనే…

గుమ్మడి కాయ కొట్టేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవ్వడానికి సిద్ధం అయ్యారట యూనిట్. సినిమా పై ఉన్న క్రేజ్ కి తగ్గ కలెక్షన్స్ ని మొదటి పార్ట్ అందుకొక పోవడం తో ఇప్పుడు రెండో పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 50 కోట్లకు పైగా టార్గెట్ తో…

NTR Kathanayakudu Nizam Day 1 Collections

బరిలోకి దిగబోతుంది. మొదటి పార్ట్ మిగిలించిన నష్టాలకి పరిహారంగా ఆ సినిమాను కొన్న వాళ్ళకే ఈ రెండో పార్ట్ ని ఫ్రీ గా ఇవ్వబోతున్నారట. దాంతో రెండో పార్ట్ బిజినెస్ లెక్క కింద ఇప్పుడు 50.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకున్నట్లు లెక్క..

అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 1 న మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా ఇప్పుడు 51.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతుందని సమచారం. దాంతో ఈ మొత్తాన్ని రికవరీ చేస్తేనే సినిమా సేఫ్ వెంచర్ అవుతుంది. మరి ఎం జరుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!