Home న్యూస్ 9 ఏళ్ల నుండి ఒక్క ఫ్లాఫ్ లేదు….యంగ్ టైగర్ మాస్ ఊచకోత!!

9 ఏళ్ల నుండి ఒక్క ఫ్లాఫ్ లేదు….యంగ్ టైగర్ మాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లను మెయిన్ టైన్ చేయడం అన్నది చాలా చాలా అరుదుగా జరుగుతుంది…టాలీవుడ్ టాప్ స్టార్స్ లో వరుస హిట్స్ తో దుమ్ము లేపడం చాలా తక్కువ సందర్బాలలోనే జరిగింది, ఒక బ్లాక్ బస్టర్ పడితే తర్వాత మళ్ళీ ఫ్లాఫ్ పడటం అన్నది కామన్ గా జరగగా…కొందరు హీరోలు మాత్రం…

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో హాట్రిక్ లను కూడా నమోదు చేశారు…ఇక లేటెస్ట్ గా 6 ఏళ్ళుగా సోలో హీరోగా సినిమా చేయని యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) మధ్యలో మమ్మోత్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ ఎపిక్ హిట్ కొట్టగా తర్వాత సోలో హీరోగా చేసిన దేవర(Devara Part 1) తో…

బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఇప్పుడు సంచలన బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. కాగా ఓవరాల్ గా టాలీవుడ్ లో లాస్ట్ 9 ఏళ్ళుగా ఒక్క ఫ్లాఫ్ మూవీ కూడా లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న ఒకే ఒక్క టాప్ హీరోగా ఎన్టీఆర్ నిలుస్తాడు అని చెప్పాలి ఇప్పుడు…

Devara Movie 27 Days Total World Wide Collections!!

2015 టైంలో చేసిన టెంపర్ తో వరుస డిసాస్టర్స్ కి బ్రేక్ వేసి హిట్ అందుకున్న ఎన్టీఆర్, తర్వాత నాన్నకు ప్రేమతో సినిమా మరో హిట్ ని అందుకున్నాడు…ఆ తర్వాత 2016 లోనే చేసిన జనతా గ్యారేజ్ తో సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తర్వాత 2017 లో చేసిన…

జై లవ కుశ సినిమాతో ఎబో యావరేజ్ రేంజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడు….ఇక 2018 టైంలో చేసిన అరవింద సమేత హిట్ అవ్వగా…ఎక్కడా భారీ బ్లాక్ బస్టర్ ఏమి పడక పోయినా కూడా ఒక్క ఫ్లాఫ్ మూవీ కూడా పడలేదు అని చెప్పాలి… ఇక తర్వాత ఎపిక్ ఆర్ ఆర్ ఆర్…

ఆ తర్వాత ఇప్పుడు దేవర మూవీ తో కెరీర్ లో బిగ్గెస్ట్ సోలో బ్లాక్ బస్టర్ ను అందుకున్న ఎన్టీఆర్ ఓవరాల్ గా లాస్ట్ 9 ఏళ్లలో 2 సాలిడ్ బ్లాక్ బస్టర్ లు…ఒక సూపర్ హిట్….3 హిట్స్ అలాగే ఒక ఎబో యావరేజ్ మూవీ తో కెరీర్ లో ఆల్ టైం బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు. ఈ స్ట్రీక్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ తో కూడా కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Devara Movie 25 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here