Home గాసిప్స్ NTR30 మరో న్యూస్…ఫ్యాన్స్ కి పండగ చేసుకునే న్యూస్ ఇది!

NTR30 మరో న్యూస్…ఫ్యాన్స్ కి పండగ చేసుకునే న్యూస్ ఇది!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ తర్వాత మంచి జోరు మీద ఉన్న కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైం లో ఆర్ ఆర్ ఆర్ కమిట్ అయ్యి ఆ సినిమా కే పరిమితం అవ్వడం తో ఫ్యాన్స్ అప్ డేట్స్  కోసం కళ్ళు ఖాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయినా అప్ డేట్స్ లేక కొత్త సినిమాల న్యూస్ లేక ఎదురు చూపులు కొనసాగుతూనే ఉండగా లేటెస్ట్ గా ఇప్పుడు…

ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ వచ్చే రెండో సినిమా గురించిన మరో న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ త్రివిక్రమ్ చెప్పిన కథల్లో ఇప్పుడు మూడో వర్షన్ కూడా చేరిందని అంటున్నారు.

ఇది వరకు ఎన్టీఆర్ కి కమర్షియల్ పొలిటికల్ కథని, తర్వాత ఆర్కియాలజీ బేస్ కథని వినిపించగా, ఇప్పుడు కమర్షియల్ కం మాస్ కథని వినిపించారని అంటున్నారు. ఇందులో కూడా ఎన్టీఆర్ కద్దరు చొక్కా చేసుకోవాల్సి ఉంటుందని, ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఉంటూనే… సెకెండ్ ఆఫ్ కి వచ్చేసరికి పల్నాటి పౌరుషాలు, ఊరమాస్ ఎలిమెంట్స్ తో…

మరో లెవల్ లో యాక్షన్ ఉంటుందని ఇండస్ట్రీ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఈ కథతో కలిపి ఎన్టీఆర్ 30 వ సినిమా పై మూడు కథలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఇందులో ఏది ఎన్టీఆర్ ఫైనల్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉండగా… రెండు కథల్లో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఆర్కియాలజీ మూవీ మాత్రం భారీ బడ్జెట్ అవసరం అని, ద్వారకకి కనెక్ట్ ఉండేలా ఈ సినిమా కథ ఉంటుందని టాక్ ఉంది. ఇక నిర్మాతలు రీసెంట్ గా సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడే సినిమా టైటిల్ ని మరిన్ని అప్ డేట్స్ ని ఇస్తామని రీసెంట్ గా చెప్పుకొచ్చారు. దాంతో ఫ్యాన్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఆశగా ఎదురు చూపులు కొనసాగిస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here