Home గాసిప్స్ పాన్ ఇండియా మూవీ ఇంకా రానే లేదు…4 ఇండస్ట్రీల డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ సినిమాలు!!

పాన్ ఇండియా మూవీ ఇంకా రానే లేదు…4 ఇండస్ట్రీల డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ సినిమాలు!!

1214
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అపజయం అంటే తెలియకుండా 5 సినిమాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతూ దూసుకు పోతుండగా ఒక్క సినిమా కోసం ఏకంగా రెండేళ్ళ సమయాన్ని కేటాయించగా మరో ఏడాది కూడా ఈ సినిమా కే సమయం పట్టేలా ఉంది. కానీ ఆ సినిమా తో పాన్ ఇండియా లెవల్ క్రేజ్ ని ఎంజాయ్ చేయబోతున్న ఎన్టీఆర్ షాకింగ్ గా ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాలు మాగ్జిమం పాన్ ఇండియా వే ఉండటం ఖాయం కానీ చేయబోతున్న డైరెక్టర్స్ కూడా ఒక్కో ఇండస్ట్రీ వారు అవ్వడం మరింత విశేషం అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ముందుగా చేస్తున్న సినిమా…

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కన్నడ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇక తర్వాత కమిట్ అయిన మూవీ కోలివుడ్ టాప్ డైరెక్టర్స్ లో…

ఒకరైన అట్లీ ది అన్న విషయం అందరికీ తెలిసిందే… ఈ సినిమా ఎప్పుడో కమిట్ అయినా సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది… ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్నది లేటెస్ట్ టాక్. కొందరు డైరెక్టర్స్ ఆల్ రెడీ ఎన్టీఆర్ కి కథలు కూడా వినిపించారట.

కానీ ఇంకా చాలా సమయం ఉన్న నేపధ్యంలో ఉన్న వాటిలో బెస్ట్ వి ఎంచుకుని తర్వాత ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఇవి అన్ని అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత మరో బిగ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం. వీటి కన్నా ముందు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here