Home న్యూస్ NTR30 త్రివిక్రమ్ తో కాన్సిల్…కారణం ఇదే…కొత్త మూవీ…ఎవరితో…రిలీజ్ డేట్ ఇదే!

NTR30 త్రివిక్రమ్ తో కాన్సిల్…కారణం ఇదే…కొత్త మూవీ…ఎవరితో…రిలీజ్ డేట్ ఇదే!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత ఆల్ మోస్ట్ మూడేళ్ళ టైం ని ఒక్క సినిమా కోసమే కేటాయించాడు, ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా తర్వాత చేయబోయే సినిమాల లిస్టు ఎప్పుడో వచ్చినా ఇప్పుడు అందులో సడెన్ గా ఒక మార్పు జరిగింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ తనకి…

అరవింద సమేత లాంటి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొత్త సినిమా కమిట్ అవ్వగా ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింది, స్ట్రాంగ్ కారణాలు ఏంటి అనేవి బయటికి రాకున్నా కానీ ఈ సినిమా కథ లో మార్పులు చేర్పులు జరగగా అవి అనుకున్న విధంగా రాక పోవడం తో…

సినిమా కథను మధ్య లో ఆపేసి కొంత గ్యాప్ తీసుకుని ఫ్రెష్ కథ తో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల సినిమా ఉండబోతుందని సమాచారం. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ప్లేస్ లో ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ తో ఆ సినిమా తర్వాతే…

కమిట్ అయిన మరో సినిమా ఇప్పుడు తెరపైకి రాగా ఆ సినిమానే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. యువ సుధ బ్యానర్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ లోనే సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకొ బోతుండగా ఆడియన్స్ ముందుకు ఈ సినిమా…

వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా రాబోతుందని అఫీషియల్ గా కన్ఫాం చేశారు. వచ్చే ఇయర్ ఏప్రిల్ 29 న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ 30 అఫీషియల్ గా కన్ఫాం అవ్వగా 31, 32, 33 సినిమాల ఆర్డర్ కూడా త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ ల కాంబో లో మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here