యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్ట్రార్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ అద్బుతాలు ఇంకా సృష్టిస్తూనే ఉండగా సినిమా ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ ని అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇక హీరోలు డైరెక్టర్ విరివిగా సినిమాను ప్రమోట్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా అందరిలోనూ ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఇద్దరు హీరోలు కలిసి కాకుండా వేరు వేరుగా ఎందుకని…
ప్రమోషన్స్ ని చేస్తున్నారు అని… దానికి రెండు రీజన్స్ ఉన్నాయి అంటూ టాలీవుడ్ లోనే చెప్పుకుంటున్నారు…. ఒకటి తక్కువ టైంలో ఎక్కువ ప్రమోషన్స్ చేయడానికి టీం విడిపోయి విరివిగా ఎన్ని కుదిరితే అన్ని ప్రమోషన్స్ చేయాలనీ అనుకున్నారని అంటూ ఉండగా దాంతో పాటుగానే ఇది వరకు…
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల టైంలో ఇద్దరు హీరోలు కలిసి ప్రమోషన్స్ చేసిన టైంలో మా హీరో బాగా మాట్లాడు అంటే మా హీరో బాగా మాట్లాడాడు అంటూ ఇక్కడ ఫ్యాన్స్ ట్రోల్స్ లాంటివి చేసుకుంటూ ఉండటంతో ఇలా వేరు వేరు గా అయితే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ హీరో ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్ ను…
ఎంజాయ్ చేస్తారన్న ఆలోచనని రాజమౌళి చేశారని అంటున్నారు. అందుకే హీరోలు ఎక్కువగా విడివిడిగా ప్రమోషన్స్ ని చేస్తున్నా ఒకటి రెండు ఈవెంట్స్ లో కలిసి ప్రమోషన్స్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇక ఒక్క అడుగు దూరంలో ఉన్న ఆస్కార్ వస్తే ఇక నేషనల్ వైడ్ గా మరోసారి ఆర్ ఆర్ ఆర్ రచ్చ ఉండే అవకాశం ఉంటుందని చెప్పాలి.