Home న్యూస్ కోటితో 19 కోట్లు+….ఇండస్ట్రీ హిట్ ని రిజక్ట్ చేసిన 2 హీరోలు!!

కోటితో 19 కోట్లు+….ఇండస్ట్రీ హిట్ ని రిజక్ట్ చేసిన 2 హీరోలు!!

1451
0

చిన్న సినిమాలు ఇప్పుడు మహా అయితే అద్బుతమైన టాక్ వచ్చినా కానీ 10-15 కోట్ల రేంజ్ షేర్ వసూల్ చేస్తే ఎక్కువే అనుకుంటాం, కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కానీ కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించాయి, ఎవ్వరూ ఊహించని రేంజ్ వసూళ్ళని కూడా సొంతం చేసు కున్నాయి, అలాంటి సినిమాల్లో 2000 ఇయర్ లో వచ్చిన నువ్వే కావాలి అనే సినిమా ముందు నిలిచే సినిమా అని చెప్పాలి.

మలయాళం లో సూపర్ హిట్ అయిన నీరం సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం కోటి రేంజ్ బడ్జెట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల కి పైగా షేర్ ని వసూల్ చేసి అప్పట్లో అత్యధిక ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచి సంచలనం సృష్టించింది.

ఒక చిన్న సినిమా అందునా అందరూ కొత్త వాళ్ళతో రూపొందిన సినిమా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 200 రోజుల దాకా నాన్ స్టాప్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి తర్వాత కూడా పరుగును కొనసాగించిన ఈ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు…

ఆల్ మోస్ట్ అప్పటి ఇండస్ట్రీ మూవీస్ రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని అందుకుని ఆ సినిమాలు కూడా సాధించలేని ప్రాఫిట్ ని అందుకుని ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న ఈ సినిమా ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తర్వాత సుమంత్ దగ్గరకు రీమేక్ ఆఫర్ వెళ్ళినప్పటికీ అనుకోని కారణాల వలన ఈ ఇద్దరూ ఈ సినిమాను చేయలేదు…

సడెన్ గా రేసులో తరుణ్ ఎంటర్ అవ్వగా తన లాంచ్ మూవీ గా మారిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది, ప్రతీ సీన్ కూడా ఇప్పటికీ ఫ్రెష్ గా ఉండే ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి 20 ఏళ్లని పూర్తీ చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా లో సినిమాను చూసిన వాళ్ళు ఈ సినిమా గుర్తులను నెమరువేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here