ఇతర భాషల నుండి ఇక్కడి కి వచ్చి మంచి పేరు సొంతం చేసుకుని ఒక హిట్ ఇస్తే చాలు వరుస పెట్టి ఆ యాక్టర్ నటించిన సినిమాలు అన్నీ ఆడియన్స్ ముందుకు క్యూ కడతాయి, లేటెస్ట్ గా కోలివుడ్ హీరో విజయ్ సేతుపతి తెలుగు లో ఉప్పెన సినిమా తో మంచి పేరు ను సొంతం చేసుకున్నాడు. దాంతో విజయ్ సేతుపతి పేరు ను క్యాష్ చేసుకోవడానికి వరుస పెట్టి తమిళ్ లో రూపొందిన…
సినిమాలను తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలు పెట్టగా, మెగా డాటర్ నీహారిక కీలక పాత్ర పోషించిన సినిమాను తెలుగు లో ఇప్పుడు ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో డబ్ చేసి రీసెంట్ గా వైల్డ్ డాగ్ సుల్తాన్ సినిమాలకు పోటి లో రిలీజ్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 120 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ ను సొంతం చేసుకుంది, విజయ్ సేతుపతి పేరు మీద తెలుగు రైట్స్ ని 25 లక్షల కి పెట్టి కొనగా, తెలుగు శాటిలైట్ రైట్స్ కింద 10 లక్షల దాకా రేటు దక్కిందట. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 లక్షలు అయినా సాధించదా….
అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నప్పటికీ ఆ టైం లో రిలీజ్ అయిన సినిమాల వలన ఈ సినిమా గురించి కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు ఇలాంటి ఒక సినిమా వచ్చింది అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. ముందు మార్చ్ 19 న రిలీజ్ అనుకున్నా పోస్ట్ పోన్ చేసి రిలీజ్ చేయగా సినిమా కి మినిమమ్ షేర్స్ కూడా రాలేదు. మొత్తం మీద…
సినిమా తెలుగు రాష్ట్రాలలో పట్టుమని 3-4 లక్షల షేర్ ని కూడా సాధించి ఉండదు అని చెప్పొచ్చు. పెట్టిన రేటు చిన్నది అయినా సినిమా జనాల్లో మినిమమ్ బజ్ ను సొంతం చేసుకున్న ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చి ఉండేవి, మొత్తం మీద ఇప్పుడు నిర్మాతకి ఓవరాల్ గా 10 లక్షల మేర నష్టం ఈ సినిమా తో వచ్చిందని చెప్పొచ్చు.