బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన మూవీస్ లో ఒకటైన సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా మీద డీసెంట్ బజ్ ఉండగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్…
సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది. మొదటి వారంలోనే డబుల్ డిసాస్టర్ రేంజ్ లో రిజల్ట్ ను కన్ఫాం చేసుకున్న సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ రన్ లో తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను….
సొంతం చేసుకున్నప్పటికీ కూడా మేకర్స్ కి మాత్రం ఓవరాల్ గా బడ్జెట్ మీద మంచి రికవరీని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా ఓవరాల్ గా ప్రమోషన్స్ తో కలిపి 25 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందగా టోటల్ గా డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ అండ్ డబ్బింగ్ రైట్స్ తో కలిపి..
నాన్ థియేట్రికల్ బిజినెస్ 18 కోట్ల రేంజ్ లో సొంతం అవ్వగా….థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 10 కోట్ల కి పైగా జరిగింది. దాంతో టోటల్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి 28 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా మేకర్స్ కి మాత్రం టేబుల్ ప్రాఫిట్…
సొంతం అవ్వగా థియేట్రికల్ రన్ లో మాత్రం 4 కోట్ల లోపే రన్ ను కంప్లీట్ చేసుకునే అవకాశం ఉన్న సినిమా బిజినెస్ లో అయితే లాస్ 6 కోట్లకు పైగానే సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో మేకర్స్ కి సినిమా ద్వారా లాభాలు వచ్చినా కొన్నవాళ్ళకి మాత్రం నష్టాలు గట్టిగానే వచ్చాయి అని చెప్పాలి ఇప్పుడు…