Home న్యూస్ ఓడెల2 మూవీ 1st డే టోటల్ కలెక్షన్స్…!!!

ఓడెల2 మూవీ 1st డే టోటల్ కలెక్షన్స్…!!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా సీక్వెల్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ పరంగా అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను అయితే అందుకోలేక పోయింది అని చెప్పాలి. మొదటి రోజున ఓవరాల్ గా సినిమా 11 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకున్న సినిమా…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుకి గాను సినిమా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మరో 30-35 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని మొదటి రోజున సొంతం చేసుకోగా ఓవరాల్ గా..

మొదటి రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా 60 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 11 కోట్ల దాకా ఉండగా..

మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ బిజినెస్ కి పెద్దగా న్యాయం అయితే చేయలేదు అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర్క మరో 10.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా  ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here