Home న్యూస్ అఫీషియల్: రికార్డులన్నీ అవుట్…టక్ జగదీష్ భీభత్సం!!

అఫీషియల్: రికార్డులన్నీ అవుట్…టక్ జగదీష్ భీభత్సం!!

2479
0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే రోజు వారి కలెక్షన్స్ తో సినిమా పై క్లారిటీ ఉండేది కానీ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకునే సినిమాల విషయం లో టాక్ ఏంటి అనేది క్లారిటీ ఉన్నా ఎన్ని వ్యూస్ వచ్చాయి, పెట్టిన అమౌంట్ కి ఎంత వరకు న్యాయం చేసింది అన్నది క్లారిటీ ఉండదు… లేటెస్ట్ గా వచ్చిన నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా…

రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ లో మిక్సుడ్ రెస్పాన్స్ రావడం జరిగింది, సోషల్ మీడియా లో సినిమా పై కంప్లీట్ గా నెగటివ్ ట్వీట్స్ తో ట్వీట్స్ పడ్డాయి…

ఆ ఇంపాక్ట్ వలన సినిమా కి ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో వ్యూవర్ షిప్ రాలేదని, నారప్ప వి మూవీ ల రేంజ్ లో సినిమా కి వ్యూవర్ షిప్ రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండగా అఫీషియల్ గా ఇప్పుడు మేకర్స్ సినిమా వీకెండ్ వ్యూవర్ షిప్ పై….

ఒక అనౌన్స్ మెంట్ చేశారు… ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది చెప్పలేదు కానీ తెలుగు లో ఇప్పటి వరకు డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న అన్ని సినిమాల రికార్డులను టక్ జగదీష్ బ్రేక్ చేసి భీభత్సం సృష్టించింది అని చెప్పారు…. ఇది నిజం అయితే ఈ టైం లో ఇది అరాచకమైన రికార్డ్ అనే చెప్పాలి కానీ….

నారప్ప, వి మూవీ లు రిలీజ్ అయిన టైం లో థియేటర్స్ లో సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు… కానీ టక్ జగదీష్ రిలీజ్ టైం లో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యాయి… ఆ టైం లో కూడా మేకర్స్ చెబుతున్నట్లు టక్ జగదీష్ రికార్డులు బ్రేక్ చేస్తే కనుక నిజంగా పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం నాని చేశాడని చెప్పొచ్చు. సినిమా కి వచ్చిన వ్యూస్ లెక్క నెల ఎండ్ టైం కి రిలీజ్ అవుతుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here