Home న్యూస్ ట్రివియా: మహేష్ ఒక్కడులో ఫస్ట్ విలన్ రోల్ ఆఫర్ చేసింది ఎవరికంటే!

ట్రివియా: మహేష్ ఒక్కడులో ఫస్ట్ విలన్ రోల్ ఆఫర్ చేసింది ఎవరికంటే!

3132
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అండ్ బిగ్గెస్ట్ ఫస్ట్ మాస్ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు అన్న విషయం అందరికీ తెలిసిందే. 2003 టైం లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఫార్మాట్ ను అనేక మంది డైరెక్టర్ లు తర్వాత అప్ కమింగ్ మూవీస్ లో…

మార్చుకుని వాడుకున్నారో కూడా తెలిసిందే, సినిమా లో మహేష్ పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో విలన్ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ పాత్ర కూడా అదే రేంజ్ లో హైలెట్ అయింది. అలాంటి ప్రకాష్ రాజ్ పాత్ర ప్లేస్ లో ముందు వేరే నటుడిని అనుకున్న విషయం కొందరికే…

తెలిసి ఉంటుంది అని చెప్పాలి… ఈ సినిమాలో ముందు ప్రకాష్ రాజ్ రోల్ లో విలన్ గా అనుకుని ఆల్ మోస్ట్ కమిట్ అయిన నటుడు ఎవరంటే…. నిజం సినిమాలో మహేష్ తో పోటి పడ్డ గోపీచంద్…. అవును ఒక్కడు సినిమాలో విలన్ గా గోపీచంద్ నే అనుకుని ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు…

కానీ షూటింగ్ మొదలయ్యే ముందు టైం లో మహేష్ గోపీచంద్ ల కాంబో లో నిజం తెరకెక్కుతున్న నేపధ్యంలో వరుసగా హీరో విలన్స్ గా మళ్ళీ నటించడం అంత బాగుండదని…. గోపీచంద్ ప్లేస్ లో మరో యాక్టర్ ని సెలెక్ట్ చేయాలనీ నిర్ణయం మార్చుకున్నారట.

గోపీచంద్ ప్లేస్ లో అప్పటికప్పుడు ప్రకాష్ రాజ్ ను అనుకోవడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట. విలన్ గా చేసిన కొన్ని సినిమాలతోనే గోపీచంద్ అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాడు… ఈ సినిమా కూడా తనకి దక్కి ఉంటె మరో లెవల్ కి వెళ్ళే వాడు కావచ్చు, కానీ సెలెక్ట్ అవ్వక పోవడం తో అదే ఇయర్ లో యజ్ఞం సినిమా కమిట్ అవ్వడం తో మళ్ళీ హీరోగా ట్రై చేయడం సక్సెస్ అవ్వడం జరిగింది తనకి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here