Home న్యూస్ ఒక్కడు4K….థియేటర్స్….డే 1 ఎంత రావొచ్చు!!

ఒక్కడు4K….థియేటర్స్….డే 1 ఎంత రావొచ్చు!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ఒక్కడు ముందు నిలుస్తుంది. 2003 టైం లో రిలీజ్ అయిన సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబుకి భారీ మాస్ ఇమేజ్ ను సొంతం అయ్యేలా చేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా సినిమాను ఇప్పుడు రీసెంట్ గా…

   

రీ రిలీజ్ వర్షన్ ను 4K లో రిలీజ్ చేశారు…. కాగా సినిమాను మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేశారు… కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ 4 రోజుల ముందే మొదలు అవ్వగా నార్మల్ వీకెండ్ లోనే…

రిలీజ్ అవుతూ ఉండటంతో ఖుషి సినిమాతో పోల్చితే ఒక్కడు బుకింగ్స్ వీక్ గానే ఉన్నాయి అని చెప్పాలి. రిలీజ్ కి ముందు రోజు ఖుషి ఆల్ మోస్ట్ 2.7 కోట్ల బుకింగ్స్ ను సొంతం చేసుకుంటే ఒక్కడు సినిమా 1.3 కోట్ల రేంజ్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.

ఇక మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా మొత్తం మీద ఇప్పుడు మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది బుకింగ్స్ చూస్తుంటే…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here