అప్పుడప్పుడు ఒక సినిమా ఇంపాక్ట్ మరో సినిమా పడటం జరుగుతుంది, కారణాలు ఏమైనా కానీ ఒకేలా ఉండే సినిమాల జానర్ ఏమాత్రం కాంట్రవర్సీలకు కారణం అవుతుంది అనుకుంటే వాటిని తప్పించడానికి మేకర్స్ తమ వంతుగా ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం ఇలాంటిదే…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న కొత్త సినిమా OMG2 సినిమా విషయంలో జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా ఇంపాక్ట్…
రిలీజ్ అయినప్పుడు వీకెండ్ లో వీర లెవల్ లో కలెక్షన్స్ వచ్చినా కానీ తర్వాత సినిమా మీద విపరీతమైన ట్రోల్స్, విమర్శలు రావడంతో కోర్టులో కేసులు సినిమా రైటర్ పై విమర్శలు ఓ రేంజ్ లో వచ్చాయి. ఈ విషయంలో అసలు సెన్సార్ వాళ్ళు కొన్ని సీన్స్ ని ఎలా ఓకే చేశారు అన్న…
వాదనలు కూడా వినిపించాయి. ఇప్పుడు అలాంటివే ఊహించి ముందు జాగ్రత్త చర్యగా అక్షయ్ కుమార్ నటిస్తున్న ఓ మై గాడ్ సినిమా సీక్వెల్ అయిన OMG2 లో కూడా కొన్ని సీన్స్ కి తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఉందని గ్రహించి మేకర్స్ తో ఆ సీన్స్ ని మార్చి తీసుకురమ్మని…
సెన్సార్ వాళ్ళు చెబుతున్నారట. పలు మార్లు కొన్ని మార్పులతో సినిమాను సెన్సార్ కి పంపించినా ఇప్పటికీ సెన్సార్ పూర్తీ అవ్వలేదట. సినిమాలో ఓ సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడంతో ఎక్కడ ఆదిపురుష్ సినిమా మాదిరి గొడవ ఈ సినిమాకి అవుతుందో అని మరింత ఆలస్యం చేస్తున్నారట. మరి సినిమా ఫైనల్ గా ఎప్పుడు సెన్సార్ ను పూర్తీ చేసుకుంటుందో చూడాలి.