Home గాసిప్స్ ఒక్క హీరో…ఇన్ని వార్తలు…రీసెంట్ టైం లో ఇదే హైయెస్ట్!!

ఒక్క హీరో…ఇన్ని వార్తలు…రీసెంట్ టైం లో ఇదే హైయెస్ట్!!

703
0

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేయబోయే సినిమాలను ఎన్టీఆర్ ఒక్కొటిగా కమిట్ అవుతున్నాడు, అదే సమయం లో రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్ గా ఒక్క మూవీ కూడా కమిట్ కాలేదు.

అదే సమయం లో రామ్ చరణ్ పై ఈ లాక్ డౌన్ టైం లో లాక్ డౌన్ తర్వాత కూడా అనేక రూమర్స్ ప్రచారం లోకి వచ్చాయి. ఆచార్య లో స్పెషల్ రోల్ చేయబోతున్న విషయం ముందే తెలిసిందే, ఆ తర్వాత లూసిఫర్ లో కూడా ముఖ్య రోల్ చేస్తున్నాడని, తర్వాత…

పవన్ కళ్యాణ్ క్రిష్ ల పాన్ ఇండియా మూవీ లో కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని వార్తలు రాగా ఇవి స్పెషల్ రోల్స్ గురించిన వార్తలు కాగా.. హీరోగా ముందు సురేందర్ తో సినిమా అని వార్తలు వచ్చాయి… తర్వాత కొరటాల శివతో సినిమా అన్నారు….

తర్వాత కొత్త డైరెక్టర్ తో మూవీ అన్నారు, రీసెంట్ గా వంశీ పైడిపల్లి తో మూవీ ఆల్ మోస్ట్ కన్ఫాం అనగా ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రామ్ చరణ్ కి ఒక స్టొరీ చెప్పి పెట్టారని అంటున్నారు. వీటితో పాటు మరికొన్ని గాసిప్స్ కూడా వరుస పెట్టి రిలీజ్ అవుతూ ఉండగా ఇప్పటి వరకు ఏది కూడా అఫీషియల్ గా కన్ఫాం కాలేదు.

ఇప్పటికే వినయ విదేయ రామ వచ్చి ఏడాదిన్నర అవ్వడం ఆర్ ఆర్ ఆర్ కి మరో ఏడాది పట్టేలా ఉండటం తో… అభిమానులు రామ్ చరణ్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో ఉండాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ అన్నీ కూడా తెలుగు వర్షన్ వి మాత్రమె… రీసెంట్ టైం లో ఒక హీరో నటించబోయే అప్ కమింగ్ మూవీస్ పై ఇన్ని కొత్త వార్తలు రావడం ఒక్క రామ్ చరణ్ కే చెల్లింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here