Home న్యూస్ ఓపెన్ హైమర్ టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!

ఓపెన్ హైమర్ టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!

0

డార్క్ నైట్ సిరీస్, ఇన్ సెప్షన్, ఇంటర్ స్టెల్లర్, టెనెట్ లాంటి ఎక్స్ లెంట్ మూవీస్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓపెన్ హైమర్(OppenHeimer) సినిమా మీద భారీ హైప్ నెలకొనగా సినిమా మీద ఇండియా లో కూడా భారీ హైప్ నెలకొనగా భారీ లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా…

ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ విషయానికి వస్తే అటామిక్ బాంబ్ సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ లైఫ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా లో ముందు ఆటం బాంబ్ సృష్టించడానికి ముందు కథ… తర్వాత ఆ బాంబ్ ప్రయోగానికి ఎలాంటి సన్నాహాలు చేశారు… తర్వాత ఆ బాంబ్ పేలిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి అన్నది సినిమాలో చూపించారు…

సినిమా మొత్తం మూడు భాగాలుగా ఉన్నట్లు అనిపించగా ఈ సినిమా చూసే ఆడియన్స్ కూడా మూడు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఒక్కో విధంగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రతీ క్లాస్ లో టాపర్ సెక్షన్ ఉంటుంది, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, స్టడీలో పూర్ స్టూడెంట్స్ ఉంటారు…

టాపర్స్ కి బాగా అర్ధం అయ్యే సబ్జెక్ట్ యావరేజ్ స్టూడెంట్స్ కి సగం సగం అర్ధం అవుతుంది. స్టడీస్ లో పూర్ స్టూడెంట్స్ కి ఏమి అర్ధం కాదు… ఓపెన్ హైమర్ సినిమా కూడా ఇలానే ఉంటుంది.. ఫిజిక్స్ లో మంచి గ్రిప్ ఉండి, సబ్జెక్ట్ ని ఈజీగా అర్ధం చేసుకునే వాళ్ళకి సినిమా కొంచం డాక్యుమెంటరీలా అనిపించినా సినిమా వాళ్ళకి బాగానే కనెక్ట్ అవుతుంది..

కానీ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ అంతంతమాత్రమే అర్ధం అయినట్లు ఓపెన్ హైమర్ కూడా అర్ధం అయినా కూడా చాలా వరకు బోర్ ఫీల్ అయ్యేలా చేసి ఏం సినిమా రా బాబు అనిపించేలా చేస్తుంది… ఓవరాల్ గా మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి సినిమా ఎక్కే అవకాశం చాలా తక్కువే అని చెప్పాలి.

క్రిస్టఫర్ నోలన్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఓపెన్ హైమర్ కంప్లీట్ గా డిఫెరెంట్ మూవీ కాగా అర్బన్ ఆడియన్స్ కి తప్పితే సినిమా మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి సినిమా చాలా బోరింగ్ గా ఎక్కువ లెంత్ తో థియేటర్స్ లో విసుగు తెప్పించడం ఖాయం… ఓవరాల్ గా చెప్పాలి అంటే సినిమా టార్గెట్ ఆడియన్స్ మాత్రం కేవలం అర్బన్ అండ్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న ఆడియన్స్ మాత్రమే…

మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ కి మాత్రం సినిమా ఓవరాల్ గా భారీగా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది… బాంబ్ చుట్టూ అల్లుకున్న కథ కూడా ఒక దశ దాటాక బోర్ ఫీల్ అయ్యేలా చేయగా చివరి అరగంట కొంచం ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నా ఓవరాల్ గా సినిమా పరంగా బోరింగ్ మూవీగా అనిపించడం ఖాయం… 

కానీ క్రిస్టఫర్ నోలన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్, ఫిజిక్స్ లో మంచి గ్రిప్ అలాగే ఓపెన్ హైమర్ గురించి తెలిసిన వాళ్లకి కొంచం లెంత్ ఎక్కువ అనిపించినా ఓవరాల్ గా బాగుంది అనిపించేలా ఉంటుంది. మొత్తం మీద నోలన్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఓపెన్ హైమర్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నే ఎక్కువగా అలరించే అవకాశం ఉంది… మిగిలిన వాళ్ళు OTT లో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here