బాక్స్ ఆఫీస్ దగ్గర 2010 టైంలో రిలీజ్ అయినప్పుడు భారీ అంచనాలను అందుకునే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచిన రామ్ చరణ్(Ram Charan) నటించిన ఆరెంజ్(Orange Movie Re Release) సినిమా అప్పట్లో భారీ డిసాస్టర్ గా నిలిచింది. కానీ సినిమా ఆడియో ఓ రేంజ్ లో హిట్ అవ్వడంతో తర్వాత టైంలో…
పాటల వలన సినిమా కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకోగా రెండేళ్ళ క్రితం రీ రిలీజ్ అయినప్పుడు సినిమా ఊహించని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుని కుమ్మేసింది. టోటల్ రన్ లో 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసిన ఈ సినిమా..
రీసెంట్ గా రెండో సారి రీ రిలీజ్ ను వాలెంటైన్స్ వీకెండ్ లో సొంతం చేసుకోగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఓవరాల్ గా టికెట్ సేల్స్ లెక్కలు 50 వేల రేంజ్ లో కుమ్మేయగా తర్వాత కూడా డీసెంట్ నంబర్ ఆఫ్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఆరెంజ్ మూవీ..
2 రోజుల్లో 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా అందుకోగా ఓవరాల్ గా రెండో రీ రిలీజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఓవరాల్ గా సెకెండ్ రీ రిలీజ్ అయిన..
సినిమాల్లో బిగ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. ఇక ఫస్ట్ రీ రిలీజ్ అండ్ సెకెండ్ రీ రిలీజ్ లు కలిపి సినిమా ఓవరాల్ గా 4.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మడం విశేషం…సినిమాకి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో మళ్ళీ మళ్ళీ రీ రిలీజ్ అయ్యి కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.