యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వలన రీసెంట్ గా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుని రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు అందరూ సినిమా రొటీన్ గా ఉందని రివ్యూలు ఇచ్చారు. స్క్రీన్ ప్లే పరంగా చాలా రొటీన్ గా ఉండటంతో…
సినిమాకీ రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి…. కానీ ఆ రివ్యూ లను ఎవ్వరూ పట్టించుకోలేదు, సినిమాలో పార్టు పార్టులుగా ఎంటర్ టైన్ మెంట్ ఉండటం తో ఆడియన్స్ సినిమాను భాగానే చూస్తూ వ్యూస్ తెప్పిస్తున్నారు. ఆహా వీడియో లో సినిమాకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి.
సినిమా కి మొదటి వీకెండ్ కి 3 లక్షల దాకా వ్యూస్ దక్కగా మొదటి వారం తర్వాత మొత్తం మీద 5 లక్షల 50 వేల దాకా వ్యూస్ దక్కగా… రెండో వీకెండ్ లో కూడా సినిమా బాగానే హోల్డ్ చేసింది. మొత్తం మీద రెండో వీకెండ్ లో సినిమా కి 85 వేల దాకా వ్యూస్ సొంతం అయినట్లు చెబుతున్నారు.
దాంతో టోటల్ గా 10 రోజులకు గాను ఈ సినిమా మొత్తం మీద 6 లక్షల 35 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ యూనిక్ వ్యూస్ ని ఆహా వీడియో 3 నెలల సబ్ స్క్రిప్షన్ 150 నుండి నెలకి 50 అనుకుంటే మొత్తం మీద 6 లక్షల 35 వేల యూనిక్ వ్యూస్ కి 50 టికెట్ రేటు చొప్పున అనుకుంటే…
3.17 కోట్ల దాకా కలెక్షన్స్ దక్కి ఉండొచ్చని అంచనా వేయవచ్చు, ఓవర్సీస్ రేట్లు ఎక్కువే ఉంటాయి కాబట్టి రేటు ఈ రేంజ్ లో రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా రేటు 4 కోట్లు అవ్వడం తో సినిమా రెండో వారం లో కానీ మూడో వారం లో కానీ ఈ బిజినెస్ మార్క్ ని దాటడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తుంది, తర్వాత వచ్చే వ్యూస్ అన్ని ప్రాఫిట్ లో భాగం అవుతాయి..