రాజ్ తరుణ్ మాళవిక నాయర్ మరియు హెబ్బా పటేల్ ల కాంబినేషన్ లో గుండెజారి గల్లంతైందే సినిమా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ కరోనా వలన అది కుదరక రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను ఆహా వీడియో లో సొంతం చేసుకోగా సినిమా 2 నెలలను పూర్తీ చేసుకుని సాలిడ్ వ్యూస్ తో దుమ్ము దుమారం చేసింది.
సినిమా కి మరీ అద్బుతమైన టాక్ ఏమి దక్కక పోయినా కానీ కామెడీ వర్కౌట్ అవ్వడం తో ఆడియన్స్ సినిమాను బాగానే చూశారు. ఆహా వీడియో వాళ్ళు సినిమాను సుమారు 4 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకోగా సినిమా మొదటి వారం లోనే అక్కడ ఏకంగా…
5 లక్షల 50 వేలకు పైగా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోగా 25 రోజులు పూర్తీ అయ్యే టైం కి 7 లక్షల 30 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం. మొదటి నెలకి గాను 7 లక్షల 50 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా….
ఇప్పుడు రెండు నెలలు పూర్తీ అయ్యే టైం కి సాలిడ్ వ్యూస్ తో దుమ్ము లేపింది, రెండో నెలలో సినిమా కి మొత్తం మీద 2 లక్షల 10 వేలకి పైగా యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. అంటే టోటల్ గా సినిమా కి 2 నెలలు పూర్తీ అయ్యే టైం కి 9 లక్షల 60 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. ఇక ఈ వ్యూస్ కి సినిమా ఎంతవరకు….
కలెక్షన్స్ ని అందుకుని ఉండొచ్చు అన్నది అంచనా వేసి చూస్తె…ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటుగా భావిస్తే… 9 లక్షల 60 వేల యూనిక్ వ్యూస్ కి మొత్తం మీద 4.8 కోట్ల దాకా రెవెన్యూ ని ఆహ యాప్ వాళ్ళు సొంతం చేసుకుని ఉండొచ్చు అని అంచనా వేయవచ్చు, పెట్టిన రేటు కి ఇది మంచి ప్రాఫిట్ అనే చెప్పాలి. ఇక మూడో నెల నుండి వచ్చేవన్నీ కూడా ప్రాఫిట్ కిందే చెప్పుకోవాలి.