థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయితే పోటి కూడా ఉంటుంది, ఓకె రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమాకి టాక్ బాగా వస్తే ఆ సినిమాకి ఆడియన్స్ ఎక్కువగా వెళుతారు, ఇక థియేటర్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఓకె రోజు సినిమాలు రిలీజ్ అయ్యి పోటి పడాలంటే మరికొంత టైం పడుతుంది… కానీ రీసెంట్ డిజిటల్ రిలీజ్ లు కన్ఫాం చేసుకున్న సినిమాల్లో అక్టోబర్ 2 న రెండు డైరెక్ట్…
తెలుగు సినిమాలు పోటి పడ్డాయి…అవే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా మరోటి అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా…. ఒరేయ్ బుజ్జిగా కొద్దిగా ముందుగా రిలీజ్ అవ్వగా నిశ్శబ్దం కొన్ని గంటల ఆలస్యంగా రిలీజ్ అయింది. మొత్తం మీద 2 సినిమాలకు ఆడియన్స్ నుండి గట్టిగానే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది…
ముఖ్యంగా నిశ్శబ్దం సినిమా విషయం లో ఫస్ట్ నుండే కొంచం డౌట్ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ ట్రీమ్స్ కి వెళ్లి పోయింది… సినిమా లో అసలు ఆసక్తి పెంచే అంశాలే లేక పోవడం స్లో పేస్ నరేషన్ పరమ బోర్ కొట్టించడం పేరుకు థ్రిల్లర్ అయినా కానీ…
హర్రర్ ఎలిమెంట్స్ అండ్ ఫైనల్ గా రొటీన్ సిల్లీ రివేంజ్ స్టొరీ మెప్పించక పోవడం తో సినిమా ఆల్ రౌండ్ ఫ్లాఫ్ గా డిక్లేర్ చేశారు అందరూ… ఇక కొన్ని గంటల ముందు రిలీజ్ అయిన రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా కూడా పరమ రొటీన్ కథ తో లెంత్ ఎక్కువ గా ఉండి బోర్ కొట్టించినా కానీ…
ఉన్నంతలో నిశ్శబ్దం తో పోల్చితే కొంచం ఎంటర్ టైన్ మెంట్ ఉండటం, సాంగ్స్ కొంచం బెటర్ గా ఉండటం తో బెటర్ గా అనిపించింది… రాజ్ తరుణ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ బెటర్ గా ఉన్నా ఆడియన్స్ ని సాటిస్ ఫై అయితే చేయలేదు… కానీ పోటి లో ఉన్న నిశ్శబ్దం కంప్లీట్ గా చేతులు ఎత్తేయడం తో 23 కోట్ల సినిమా వల్ల కానిది 4 కోట్ల సినిమా బెటర్ గా వీకెండ్ ని ముగించింది అని చెప్పొచ్చు.