ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదలు అయినప్పుడు రెండు వేరు వీరు ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోల సినిమా అవ్వడంతో అందరిలోనూ సినిమా పై ఆసక్తి పెరిగి పోగా ఫ్యాన్స్ మాత్రం మా హీరో ది మెయిన్ రోల్ అంటూ అప్పటి నుండే గొడవలు స్టార్ట్ చేయగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా…
ఇవి కొనసాగగా తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ గా సినిమాకి క్రేజ్ వచ్చిన తర్వాత కూడా మా హీరోకి ఎక్కువ క్రేజ్ మా హీరోకి ఎక్కువ క్రేజ్ అంటూ గొడవలు పడుతూనే ఉండగా ఆస్కార్ అవార్డ్ దాకా ఇది కొనసాగి ఇక ఇక్కడితో అన్నీ ఆగిపోతాయి అనుకుంటే ఆస్కార్ అవార్డ్ టైంకి..
ఇది పీక్స్ కి వెళ్ళింది… ఒక పక్క ఆస్కార్ వచ్చిందని ఎంతో మంది సంతోషంగా ఉండగా ఆస్కార్ అవార్డు టైంలో నామినేషన్ టైంలో ఒక్క రామ్ చరణ్ ఫోటోనే కనిపించగా అవార్డ్ వచ్చిన తర్వాత ఒక పక్క ఇద్దరు హీరోల ఫోటోలు ఉంటే మరో పక్క కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే పెట్టడంతో….
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ అవార్డ్ ప్రజెంట్ ఫూటేజ్ ను వాడకుండా ఇతర ఫూటేజ్ ను వాడుతూ మరో పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఫ్రేమ్ నే వాడుతూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఈ ట్రోల్స్ లో ఏకంగా సినిమాల PR లు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో అవార్డు మన సినిమా గెలిచింది అన్న ఆనందం ఉన్నా ఇలా ఇప్పటికీ గొడవలు పడుతూనే ఉండటం ఇతరులను ఇబ్బంది పెడుతుంది..