బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలు నటించిన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాలు రెండూ రిలీజ్ అయ్యి వేటి రేంజ్ లో అవి ఆడియన్స్ ని అలరించి మొత్తం మీద 2 సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలుగా నిలిచాయి. వీర సింహా రెడ్డి పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా వాల్తేరు వీరయ్య ఇప్పటికీ లిమిటెడ్ షేర్స్ తో రన్ అవుతుంది.
ఇక రెండు సినిమాలు కూడా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా నెట్ ఫ్లిక్స్ లో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుండగా బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 23న….
డిజిటల్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. థియేట్రికల్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ పోటి మొదలు అవ్వగా నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ప్రస్తుతానికి వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్ రిలీజ్ పై ఒక్క పోస్టర్ రిలీజ్ తో సరిపెట్టగా….
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు వీర సింహా రెడ్డిని సోషల్ మీడియాలో భాగా ప్రమోట్ చేస్తూ డిజిటల్ రిలీజ్ డేట్ ని అందరికీ తెలిసేలా చేస్తున్నారు… దాంతో ప్రస్తుతానికి డిజిటల్ రిలీజ్ పోటిలో చిరు సినిమా సైలెంట్ గా ఉంటే బాలయ్య సినిమా ఎక్కువ రచ్చ చేస్తుంది. ఇక ఈ 2 సినిమాలు డిజిటల్ లో ఎలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.
very curious to see both movies on OTT plat form
Waltair Veeriah 50+ crores profits