నాచురల్ స్టార్ నాని నజ్రియాల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని అయితే సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా పూర్తిగా అండర్ పెర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేయని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని నిరాశ కలిగించే రిజల్ట్ తోనే ముగించడానికి సిద్ధం అవుతుంది.
ఇక సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు చెల్లించి నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. కాగా సినిమాను ముందు 6 వారాల గ్యాప్ లో డిజిటల్ లో రిలీజ్ చేయాలి అనుకున్నా…
ఇప్పుడు ఒక వారం ముందుగానే డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జులై 8న సినిమా డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది అంటూ లేటెస్ట్ సమాచారం… ఆల్ మోస్ట్ రిలీజ్ అయిన నెల లోపే ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా….