బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) పూరీ జగన్నాథ్ ల కాంబోలో భారీ హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మొదటి పార్ట్ భారీ సక్సెస్ వలన రెండో పార్ట్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. కానీ రెండో పార్ట్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడం విషయంలో…
తీవ్రంగా విఫలం అయ్యి ఏ దశలో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది…దానికి తోడూ సినిమాలో ఆలీ కామెడీ సీన్స్ కానీ పూరీ జగన్నాథ్ టేకింగ్ కానీ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో విసుగు పుట్టేలా చేశాయి. ఇలాంటి లేకి సినిమా ఎలా తీశారు అంటూ అందరూ రిలీజ్ టైంలో సినిమా ను ఓ రేంజ్ లో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన ఈ సినిమా ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా, చాలా త్వరగానే బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 3 వారాల గ్యాప్ కే డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ అయిన సినిమా కి ఇప్పుడు ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా…
ఇక్కడ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మరింత దారుణంగా ఉంది అని చెప్పాలి ఇప్పుడు…మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించలేని ఎన్నో సీన్స్ తో నిండిపోయిన సినిమాలో రామ్ క్యారెక్టరైజేషన్ అండ్ డైలాగ్స్ ఒక్కటి తప్పితే అసలు చెప్పుకోవడానికి కూడా ఏమి లేవు అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు…ఇక ఆలీ కామెడీ సీన్స్ రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది వరస్ట్ సీన్స్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు…
మొదటి పార్ట్ తో పోల్చితే రెండో పార్ట్ అత్యంత దారుణంగా విఫలం అయ్యింది అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు, కానీ రామ్ క్యారెక్టర్, తన ఎనర్జీ అలాగే పాటల్లో రామ్ స్టెప్స్ బాగుండటంతో కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా దారుణంగా అనిపించింది అని, ఇలాంటి సినిమా డిసాస్టర్ అవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ కూడా చెబుతున్నారు ఇప్పుడు…
మొత్తం మీద ఈ ఇయర్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో వరస్ట్ మూవీస్ లో ముందు నిలిచే సినిమాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ చెబుతూ ఉండటంతో డిజిటల్ రెస్పాన్స్ ఏ రేంజ్ లో నెగటివ్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు…ఇక డిజిటల్ లో సినిమా కి ఇప్పుడు వ్యూవర్ షిప్ పరంగా ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.